Chandrababu: నేను కూడా జగన్ బాధితుడినే.. సైకో పాలనలో విధ్వంసమే.. జగన్ పై చంద్రబాబు కామెంట్స్ వైరల్!

Chandrababu:  ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇటీవల విజయవాడలో విధ్వంసం పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వెళ్లారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం ఏపీ ప్రభుత్వ పనితీరుపై చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మన దేశంలోనే ఒక రాష్ట్ర ప్రభుత్వం పాలనపై విధ్వంసం అనే పుస్తకాన్ని రాయటం మొదటిసారి అంటూ ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. నా మనసులో మాత్రమే కాకుండా ఈ రాష్ట్ర ఐదు కోట్ల ప్రజల మనసులో ఏముందో ఈ విధ్వంసం అనే పుస్తకంలో ఉందని చంద్రబాబు నాయుడు తెలిపారు.

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రజలు సైకో ముఖ్యమంత్రి అంటున్నారు అంటే ఆయన పాలన ఎలా ఉందో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవచ్చు ఈ ఐదేళ్ల కాలంలో మన పిల్లల భవిష్యత్తు విధ్వంసం అయింది మన రాష్ట్ర భవిష్యత్తు విధ్వంసం అయ్యిందని తెలిపారు. అమరావతిలో రాజధానిని నిర్మించడం కోసం 30 వేల ఎకరాలను 33,000 మంది రైతులు త్యాగం చేశారు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం మన రాష్ట్రానికి రాజధాని లేకుండా ఎంతో మందిని నిరుద్యోగులుగానే నిలబెట్టారు..

ప్రజావేదిక కూల్చి అలా వదిలేశారు. నేను చూసి బాధపడాలని. నేను అడిగానని ప్రొక్లైనర్లతో కూల్చి విధ్వంసం చేశారు. వచ్చిన పరిశ్రమలు అన్నింటిని కూడా ఇతర రాష్ట్రాలకు బలవంతంగా పంపించేసారని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ సైకో పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, నేను కూడా జగన్ బాధితుడిని అంటూ ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

రాష్ట్రంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడానికి జగన్ మానసిక పరిస్థితి కారణమని తెలిపారు. ఇకపై ఇలా జరగకుండా ఉండాలి అంటే ప్రజలందరూ నడుం బిగించాలని కుల మతాలు ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరూ చైతన్యం కావాలి అంటూ ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -