Chandrababu Naidu: నన్ను అంతమొందించడానికి కుట్ర జరుగుతోంది.. వైరల్ అవుతున్న చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

Chandrababu Naidu: రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు అక్టోబర్ 25న విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జికి మూడు పేజీల లేఖ రాశారు. అందులో తనని అంతం చేసేందుకు కుట్ర జరుగుతుందని తన భద్రత, ఆరోగ్యం పై అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు. జైలు అధికారుల ద్వారా ఈ లేఖ జడ్జికి చేరింది. నన్ను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారు. నేను జైలుకు వచ్చినప్పుడు అనధికారికంగా వీడియోలు, ఫోటోలు తీశారు.

నా ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఈ తరహా వీడియోలు, ఫుటేజ్ రిలీజ్ చేశారు. కుట్రపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి లేఖ కూడా వచ్చింది. ఈ లేఖ పై ఇప్పటివరకు పోలీస్ అధికారులు ఎలాంటి విచారణ చేపట్టలేదు. జైలులో అనేక ఘటనలను చోటు చేసుకుంటున్నాయి. కొందరు దుర్మార్గులు జైలులోకి గంజాయి ప్యాకెట్లు విసిరారు, తోటలో ఉన్న కొంతమంది ఖైదీలు గంజాయిని పట్టుకున్నారు. ఖైదీలలో 750 మంది తీవ్ర నేరాలకు పాల్పడిన వారు ఉన్నారు.

కొంతమంది ఖైదీల వల్ల నా భద్రతకు తీవ్ర ముప్పు పొంచి ఉంది. ఈనెల 6న జైలు ప్రధాన ద్వారం మీదుగా డ్రోన్ ఎగురవేశారు. ములఖత్ అప్పుడు నా కుటుంబం నన్ను కలిసాక వారి చిత్రాల కోసం డ్రోన్ ఎగరవేశారు. నాతోపాటు నా కుటుంబ సభ్యులకు కూడా ప్రమాదం పొంచి ఉంది అని చంద్రబాబు లేఖలో వివరించారు. నాకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది నేను జైల్లోకి వచ్చినప్పుడు అనధికారికంగా వీడియోలు, ఫోటోలు తీసి ఆ ఫుటేజ్ ను స్వయంగా పోలీసులే లీక్ చేశారు.

నా రిప్యుటేషన్ ను దెబ్బతీసేందుకే ఈ తరహా వీడియో ఫుటేజ్ రిలీజ్ చేశారు. ఎస్ కోటకి చెందిన ఒక ముద్దాయి జైల్లో పెన్ కెమెరాతో విజువల్స్ తీస్తున్నారని నా దృష్టికి వచ్చింది. డ్రోన్లు ఎగరవేసింది కూడా ప్రభుత్వంలో ఉన్నవాళ్లే అని భావిస్తున్నాను. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నాలుగున్నరేళ్ళ కాలంలో నాపై వివిధ సందర్భాలలో అధికారంలో ఉన్నవాళ్లు దాడులు చేశారు అంటూ ఫిర్యాదు చేశారు చంద్రబాబు. మరి దీనిపై జడ్జి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -