Chandrababu Naidu: ప్రమాదపు అంచులలో నేను, నా కుటుంబం.. చంద్రబాబు లేఖ విషయంలో వాస్తవాలు ఇవేనా?

Chandrababu Naidu: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ కేసులో అరెస్టయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే బాబుని బయటికి తీసుకువెళ్లడానికి టీడీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ అవేమి ఫలించలేదు. కాగా గడిచిన కొద్దీ రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చంద్రబాబు తాజాగా తన భద్రతపై కూడా పలు అనుమానాలను వ్యక్త పరుస్తూ ఏసీబీ కోర్ట్ న్యాయమూర్తికి లేఖ రాసారు. ఈ లేఖలో బాబు ప్రస్తావించిన పలు అంశాలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారుల ద్వారా ఈ లేఖను న్యాయమూర్తికి పంపించారు చంద్రబాబు.

జైలు పై అనధికారికంగా డ్రోన్లు ఎగరేస్తున్నారని, తన కుటుంబసభ్యులు ములాఖత్ కు వచ్చిన సమయంలో కూడా ఈ డ్రోన్ల కలకలం ఉంటుందని, ఎప్పటికప్పుడు తన కదలికలను డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని లేఖలో తెలిపారు. ఎస్ కోటకు చెందిన ఒక ముద్దాయి పెన్ కెమెరాలతో ఇక్కడి విజువల్ చిత్రీకరిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందంటూ, తనను అంతమొందించడానికి వామపక్ష తీవ్రవాదులు కుట్ర చేస్తున్నారని, అందుకు సంబందించిన లేఖపై జైలు అధికారులు ఎటువంటి విచారణ చేపట్టలేదని, తనకే కాదు తన కుటుంబానికి కూడా ప్రమాదం పొంచి ఉందని చంద్రబాబు మూడు పేజీలతో కూడిన లేఖను ఏసీబీ న్యాయమూర్తికి రాశారు. జైలు ఆవరణలోకి గంజాయి ప్యాకెట్లను ఎవరో విసిరేస్తున్నారు అన్నారు.

తానూ జైల్లోకి వచ్చిన సమయంలో కూడా తన విజువల్స్ తీసి బయటకు వదిలారని అది తన గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేలా చేస్తాయంటూ తన ఆవేదనను వెల్లడించారు. తనను అంతమొందించడానికి పెద్దమొత్తంలో సుపారీ చేతులు మారిందని తనకు, తన కుటుంబసభ్యులకు రక్షణ కలించాలంటూ ఆ లేఖలో తన ఆందోళనను న్యామూర్తికి వివరించారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, మరో 14 ఏళ్ళు ప్రతిపక్షనేతగా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు సేవ చేసిన ఒక విజనరీ నాయకుడు తన రాష్ట్రంలోనే తనకు భద్రత లేదు అంటూ న్యాయమూర్తికి లేఖ రాయవలసిన పరిస్థితి వచ్చిందంటేనే అర్ధమవుతుంది జైలు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ఆయన భద్రత పై ఏమాత్రం శ్రద్ద చుపిస్తున్నారో అనేది. ఇప్పటికే ఇన్ఫెక్షన్ చేరి చర్మ, కంటి సమస్యలతో బాధపడుతున్న బాబు ఇప్పుడు తన ప్రాణానికే ముప్పు వాటిల్లబోతుంది అంటూ లేఖ రాయడంతో అటు బాబు కుటుంబ సభ్యులతో పాటు ఇటు టీడీపీ క్యాడర్లో కూడా బాబు ప్రాణాలపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అదీకాక వైసీపీ నేతలు పదేపదే చంద్రబాబు చావు ప్రస్తావన తేవడం కూడా ఈ ప్రభుత్వం పై టీడీపీ శ్రేణులు అనుమానాలకు బలం చేకూస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -