Chandrababu: కుప్పంలో గెలుపు కోసం చంద్రబాబు వ్యూహాలివే.. ఎదురుగాలి వీస్తోందని అలా చేస్తున్నారా?

Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ప్రజా గళం పేరిట పెద్ద ఎత్తున పర్యటనలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే గత కొన్ని దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు కుప్పంలో అత్యధిక మెజారిటీతో విజయం కైవసం చేసుకుంటున్నారు. ఇలా ముఖ్యమంత్రి హోదాలో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పటికీ ఈయన కుప్పం నియోజకవర్గంలో విజయకేతనం ఎగరవేశారు కానీ ఈసారి మాత్రం అక్కడికి గెలుపు చాలా కష్టతరంగా అనిపిస్తుంది.

కొన్ని దశాబ్దాలుగా కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా కుప్పం ప్రజలకు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు చేయలేదు అలాగే కుప్పం అభివృద్ధికి దోహదపడలేదు కానీ చంద్రబాబు నాయుడుని కుప్పంలో ఓడిస్తే పూర్తిగా తెలుగుదేశం పార్టీని పాతాళానికి తొక్కేయచ్చు అన్న వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి పావులు కదిపారు.

ఈ క్రమంలోనే కుప్పం మున్సిపాలిటీగా చేసి ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతాలను సంపాదించుకున్నారు. ఇదే కుప్పంలో వైసిపికి గట్టిపట్టు అని చెప్పాలి. ఇలా కుప్పంలో వైసీపీ ఫ్యాను గాలివీస్తున్నటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు ఓటమి భయంతో పెద్ద ఎత్తున కుప్పంలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా కుప్పంలో చంద్రబాబు నాయుడు ప్రచారం చేయలేదు. చివరికి నామినేషన్ కూడా స్థానికుల చేత వేయించేవారు.

కానీ ఈసారి మాత్రం పరిస్థితి అలా లేదు కుప్పంలో చంద్రబాబు నాయుడు పోటీ చేయడమే కాకుండా ప్రస్తుతం ఆయన సతీమణి నారా భువనేశ్వరి కూడా కుప్పంలో పర్యటన చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈసారి తన భార్య భువనేశ్వరి చేత నామినేషన్ కూడా వేయించారు. ఈసారి కనుక అక్కడ ఓడిపోతే తనకు పూర్తిగా రాజకీయ జీవితమే ఉండదని భావించిన చంద్రబాబు నాయుడు గెలవడం కోసం కొందరు స్థానిక నేతలను పిలిచి కుప్పంలో ఇదే నాకు చివరి ఎన్నిక ఇకపై తాను పోటీ చేయను ఈసారి గెలిపిస్తే వచ్చే ఎన్నికలలో మీకే కుప్పం టికెట్ ఇస్తానని తన రాజకీయ మార్క్ చూపిస్తూ గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు తన రాజకీయ తెలివితేటలను ప్రదర్శించి కుప్పం నియోజకవర్గాన్ని గెలిపించుకుంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: జగన్ అధికారంలోకి వస్తే ఏపీ ప్రజల భూములు పోతాయా.. బాబు చెప్పిన విషయాలివే!

Chandrababu Naidu: జగన్ మరొకసారి అధికారంలోకి వస్తే ప్రజల భూములను అధికారికంగా కబ్జా చేస్తారని భయం ప్రజల్లో పట్టుకుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టం కబ్జాదారులకు అక్రమార్కులకు...
- Advertisement -
- Advertisement -