Kodali Nani: గుడివాడ టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి? కొడాలి టార్గెట్ గా బాబు అదిరిపోయే స్కెచ్

Kodali Nani: తెలుగు రాష్ట్రాల్లో గుడివాడ అసెంబ్లీ స్ధానానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే యుగపురుషుడు , టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామావు గుడివాడ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి పలుమార్లు గెలుపొందారు. దీంతో గుడివాడ అసెంబ్లీ స్థానానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. అంతేకాకుండా కృష్ణా జిల్లాలో అత్యంత కిలమైన నియోజకవర్గంగా ఇది గుర్తింపు పొందింది. అయితే సీనియర్ ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గంలో ఇప్పుడు టీడీపీ క్లిష్ట పరిస్ధితులను ఎదుర్కొంటోంది. బలమైన అభ్యర్ధి లేక టీడీపీ సతమతమవుతుంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇక టీడీపీ ఓటమిపాలైంది.

వైసీపీ నుంచి కొడాలి నాని వరుసగా ఇక్కడ గెలుపొందుతున్నారు. గతంలో టీడీపీ నుంచి గెలిచిన ఆయన.. ఆతర్వాత వైసీపీలోనూ తమ హవా కొనసాగిస్తున్నారు. దీంతో ముచ్చటగా మూడోసారి వైసీపీ నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని కొడాలి నాని చూస్తున్నారు. అయితే చంద్రబాబుపై అసభ్యకరంగా పదజాలంతో బూతులు తిడుతూ కొడాలి నాని రెచ్చిపోతూంటారు. వినలేని, రాయలేని మాటలతో చంద్రబాబు బండ బూతులు తిడుతూ ఉంటారు. కొడాలి నాని నుంచి ఒక్క మంచి మాట కూడా రాదు. చంద్రబాబు కించపరుస్తూ నొటికొచ్చినట్లు బూతు వ్యాఖ్యలతో రెచ్చిపోతూ ఉంటారు. జగన్ అండ ఉండటంతో చంద్రబాబుపై కొడాలి నాని నోరు పారేసుకుంటారు.

చంద్రబాబుపైనే కాదు లోకేష్ పై కూడా ఇచ్చం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. ఇక చంద్రబాబు భర్య భువనేశ్వరిపై కొడాలి నాని పలమార్లు అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఆమెను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడంపై కొడాలి నానిపై టీడీపీ వర్గాలు భగ్గుమన్నారు. దీంతో కొడాలి నాని విషయంలో టీడీపీ అధిష్టానం ఫుల్ సీరియస్ ాగా ఉంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా నానిని ఓడించాలనే లక్ష్యంతో చంద్రబాబు పావులు కదుపుతున్నారు. దీని కోసం ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తున్నారు.

కొడాలి నానిని ఓడిస్తే పరాజయం బాధతో వాయిస్ బలంగా వినిపించే అవకాశం ఉండదు. దీంతో ఎాలాగైనా సొంత ఇలాఖాలో కొడాలి నానికి చెక్ పట్టేందుకకు చంద్రబాబు ఇప్పటినుంచే కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం గుడివాడ టీడీపీ ఇంచార్జ్ గా రావి వెంకటేశ్వరరావు ఉన్నారు. కానీ కొడాలి నానిపై ఆయన పలుమార్లు ఓడిపోయారు. కొడాలి నానిని ఓడించేంత బలం, శక్తి ఆయనకు లేవు. ప్రజల్లో ఆయనకు అంత ఆదరణ, క్రేజ్ లేదు. దీంతో గత ఎన్నికల్లో కొడాలి నానిపై దేవినేని అవినాష్ ను టీడీపీ పోటీలోకి దింపింది. కానీ దేవినేని అవినాష్ కూడా కొడాలి నానిపై గెలుపొందలేకపోయారు.

ఆ తర్వాత దేవినేని అవినాష్ వైసీపీలో చేరారు. దీంతో ప్రస్తుతం గుడివాడలో టీడీపీకి బలమైన అభ్యర్థి అంటూ ఎవరూ లేదు. ఈ క్రమంలో బలమైన అభ్యర్థి కోసం చంద్రబాబు కసరత్తులు చేస్తున్నారు. కొడాలి నానిని ఢీకొట్టే అభ్యర్థి కోనం వెతుకులాట మొదలుపెట్టారు. ఈ క్రమంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలు్తోంది. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామమేశ్వరరావును గుడివాడ నుంచి బరిలోకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడిగా దేవినేని ఉమాకు పేరుంది.

కృష్ణా జిల్లా టీడీపీలో అత్యంత సీనియర్ నేతగా ఆయన ఉన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. 2009,2014 ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం నుంచి దేవినేని ఉమా పోటీ చేసి గెలుపొందారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వసంత రామకృష్ణప్రసాద్ చేతిలో ఓటమి పాలయ్యారు. కానీ వచ్చే ఎన్నికల్లో గుడివాడలో ఎలాగైనా కొడాలి నానిని ఓడించాలనే లక్ష్యంతో టీడీపీ ఉంది. అందుకే సీనియర్ నేతగా, బలమైన నేతగా పేరున్న దేవినేని ఉమాను పోటీలోకి దింపేందుకు చంద్రబాబు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -