Chandrababu: చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి 50 రోజులు.. వైసీపీ కోరుకున్నది దక్కినట్టేనా?

Chandrababu:  ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ స్కాంలో భాగంగా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అరెస్టు అయిన సంగతి మనకు తెలిసిందే నంద్యాలలో సిఐడి అధికారులు ఈయనని తమక స్టడీలోకి తీసుకున్నారు. అయితే ఇలా అధికారులు వలలో చంద్రబాబు నాయుడు బంది అయ్యారు అనే విషయం తెలియడంతో ఎంతో మంది నిరసనలు తెలియజేశారు అయితే ఈయనకు ఎలాంటి రిమాండ్ ఉండదని తొందరలోనే బయటకు వస్తారు అంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇలా చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లిన తర్వాత రెండు రోజుల్లో బయటకు వస్తారన్నారు అది కింది కోర్టులో పని కాకపోతే పై స్థాయి కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకుంటామని కూడా ఆశించారు కానీ ఇవేవీ జరగలేదు. ఈయన మాత్రం ఇప్పటికీ రిమాండ్ ఖైదీగానే ఉన్నారు. ఇక శనివారంతో చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లి ఏకంగా 50 రోజులు పూర్తి అయింది. చంద్రబాబు నాయుడుకి కోర్టులో ప్రతిసారి చుక్కెదురు కావడంతో అభిమానులు కూడా తీవ్ర స్థాయిలో నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు పట్ల పలువురు టిడిపి నేతలు కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. స్కిల్ డెవలప్స్ స్కామ్ లో భాగంగా ఇదివరకే ఎంతోమంది అరెస్ట్ అయి బెల్ మీద బయటకు వచ్చారు కానీ చంద్రబాబు నాయుడుకు మాత్రం ఇప్పటివరకు బెయిల్ రాకపోవడంతో ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా చేసినదేరని అందుకే బెయిల్ రాకుండా తనని అడ్డుకుంటున్నారు అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు జైలు జీవితం గడుపుతూ 50 రోజులను పూర్తి చేసుకున్నారు.

ఈ విధంగా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ స్కామ్ లో భాగంగా అరెస్టు కావడంతో తన భార్య నారా భువనేశ్వరి న్యాయం గెలవాలి అంటూ యాత్ర చేపడుతున్నారు. అలాగే ఎన్నో రకాలుగా చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకిస్తూ మద్దతు తెలియజేశారు. ఎన్ని చేసినప్పటికీ అధికారులు మాత్రం పక్క సాక్షాదారాలతో చంద్రబాబు నాయుడుని అరెస్టు చేశారనేది మాత్రం వాస్తవం కానీ వైసీపీ ప్రభుత్వం పై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఇక చంద్రబాబు నాయుడు ఇన్ని రోజులపాటు జైలులో ఉండడంతో వైసిపి నేతలు కూడా కోరుకున్నది జరిగింది అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -