Chandrababu: తాడేపల్లి గోడలు బద్దలుగొడదామని చెబుతున్న చంద్రబాబు.. కూటమి ఫలితాలు వైసీపీకి షాకివ్వబోతున్నాయా?

Chandrababu: చంద్రబాబు, పవన్ కలిసి ప్రచారం మొదలు పెట్టిన తర్వాత వారి ప్రచారానికి ప్రజలు తండోపతండాలు వస్తున్నారు. అటు కూటమి నేతల్లో కూడా ఉత్సాహం డబుల్ అవుతోంది. దీంతో.. చంద్రబాబులో కూడా గతంలో ఎన్నడూ లేని ఉత్సాహం కనిపిస్తోంది. చంద్రబాబులో గెలుపు ధీమా స్పష్టంగా కనిపిస్తోంది. అలా అని ఎక్కడా రిలాక్స్ అవ్వకుండా మరింత ఉత్సాహం ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే జరిగే నష్టం ఏంటో స్పష్టంగా వివరిస్తున్నారు. విధ్వంసపాలన కావాలా.. అభివృద్ధి రాజ్యం కావాలా తేల్చుకోవాలని ఓటర్లకు సూచింస్తున్నారు. సంక్షేమం కావాలా.. సంక్షోభం కావాలా అని ప్రశ్నిస్తున్నారు. ప్రజల ఆస్తులకు రక్షించే వాడు కావాలా? వైసీపీ భూ బకాసురులు కావాలో తేల్చకోవాలని చంద్రబాబు పిలుపునిస్తున్నారు. చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు రోడ్ల నిర్మాణానికి ఎంత ప్రధాన్యత ఇచ్చేవారో గుర్తు చేస్తున్నారు. అందుకే నడుములు విరిగే రోడ్లు కావాలా.. రహదారి భద్రత కావాలా అని ఓటర్లను ప్రశ్నిస్తున్నారు. సంపద సృష్టించేవాళ్లు కావాలా? పది రూపాయలు ఇచ్చి.. వంద రూపాయలు తీసుకునే వాళ్లు కావాలో తేల్చుకోండని స్పష్టంగా చెబుతున్నారు. మే 13న ఆలోచించుకుని ఓటెయ్యాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజాతీర్పుతో తాడేపల్లి కోట బద్దలవ్వాలని అన్నారు.

వైసీపీ చేసిన తప్పులకు అప్పులకు రాష్ట్రం వెంటిలేటర్ పై ఉందని చంద్రబాబు అన్నారు. ఐదేళ్ల పాలనతో రాష్ట్ర ఆదాయం కంటే అప్పులే ఎక్కువ పెరిగాయని విమర్శించారు. గత ఎన్నికల ముందు ఇంటింటికి తిరిగిన జగన్ సీఎం అయిన తర్వాత ఒక్కసారి అయినా ప్రజల్లోకి వచ్చారా? అని ప్రశ్నించారు. ఐదేళ్ల పాటు ప్రజలకు కనిపించకుండా పదాలు వేసుకుని తిరిగిన జగన్ ఇప్పుడు మళ్లీ జనంలోకి వస్తున్నారని మండిపడ్డారు. జగన్ కు మనుషుల మీద ఎలాంటి ప్రేమ లేదని.. మనిషికి ఉన్న ఓటు మీద మాత్రమే ప్రేమ ఉందని అన్నారు. మరోసారి దగా చేయడానికి వస్తున్న జగన్ నమ్మొద్దని చంద్రబాబు సూచించారు. కొన ఊపిరితో ఉన్న రాష్ట్రానికి ఎన్డీయే కూటమి ఆక్సిజన్‌ లా పనిచేస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాజధాని నిర్మాణం జరగాలి.. పోలవరం పూర్తి అవ్వాలి.. సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయాలని అన్నారు. అవన్నీ జరగాలంటే జగన్ ఇంటికి పోవాలని అన్నారు. మరోసారి వైసీపీ అవకాశం ఇస్తే.. యువత భవిష్యత్ అదోగతిపాలవుతుందని చెప్పారు.

మరోవైపు పవన్ కూడా ఓటర్లను అప్రమత్తం చేస్తున్నారు. అయిదేళ్లలో వైసీపీ విధ్వంసం పరాకాష్ఠకు చేరుకుందని అన్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టుచేసి జైల్లో పెట్టారని పవన్ గుర్తు చేశారు. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలితే.. ఏపీ భవిష్యత్ ఇక శూన్యమేనని అన్నారు. అలా జరగకూడదనే.. టీడీపీ, బీజేపీ, జనసేన జతకట్టామని చెప్పారు. దాని కోసం ఎన్నో సర్దుబాట్లు జరిగాయిని అన్నారు. 40 ఏళ్లకు పైగా అనుభవం, బలమైన వ్యవస్థ ఉన్న చంద్రబాబు చాలా తగ్గారని.. తాను కూడా చాలా విషయాల్లో తగ్గాల్సి వచ్చిందని అన్నారు. సొంత అన్నయ్య నాగబాబుకి కూడా సీటు సర్దుబాటు చేయలేకపోయానని గుర్తు చేశారు. ఇవన్నీ రాష్ట్ర భవిష్యత్ కోసమేనని పవన్ చెప్పారు.

అయితే, తాము మాత్రమే రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచిస్తే సరిపోదని పవన్ అన్నారు. ఎలాంటి వారినైనా ఓటు వేసి చట్ట సభలకు పంపించే సత్తా ప్రజలకు మాత్రమే ఉందని అన్నారు. ఓ నియంత, ఓ విధ్వంసకుడుని గెలిపిస్తే ఏం జరుగుతుందో.. గత ఐదేళ్లు చూశామని చెప్పారు. అందుకే ఈసారి ఆలోచించి ఓటు వేయాలని పవన్ సూచించారు. మరోవైపు చంద్రబాబు, పవన్ లో ఉత్సాహం చూస్తే జగన్ కు ఘోర ఓటమి తప్పేలా లేదు.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -