Constipation: వేసవిలో మలబద్ధకం సమస్య.. వెంటనే ఇలా చేయండి?

Constipation: మలబద్ధకం సమస్య.. ఈ రోజుల్లో చాలామందిని ఈ సమస్య పట్టిపీడిస్తోంది. మలబద్దకానికి అనేక రకాల కారణాలు ఉండగా అందులో ప్రధాన కారణం ఆహార పదార్థాలే అని చెప్పవచ్చు. మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారికి మలవిసర్జన చేయడం అనేది ఇంత కష్టం అనేది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుందని చెప్పవచ్చు. కొన్ని కొన్ని సార్లు మలబద్దక సమస్య తీవ్రం అయ్యి ఆపరేషన్ ల వరకు వెళుతూ ఉంటుంది. అంతవరకు వెళ్లకుండా మలబద్ధకం సమస్యలకు వంటింటి చిట్కాలతో చెక్ పెట్టవచ్చు. అదేలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పుచ్చకాయ రసం.. పుచ్చకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వేసవిలో పుచ్చకాయ తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ పండు అలాగే తిన్నా జ్యూస్ రూపంలో తీసుకున్న శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. జీర్ణవ్యవస్థను శుభ్రంగా ఉంచుతుంది. కడుపు నొప్పిని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా పుచ్చకాయతో జ్యూస్ తయారు చేసి తాగితే చాలా సేపు పొట్ట నిండుగా ఉండడంతో పాటు జీవక్రియకు కూడా మేలు చేస్తుంది. అలాగే పొట్టను చల్లగా ఉంచుతుంది. దోసకాయ రసం.. పుచ్చకాయలాగే దోసకాయలో కూడా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నయం చేయడంలో కూడా సహాయపడుతుంది. ఈ కూరగాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి.

 

ఇది కడుపులో సున్నితంగా ఉంటుంది. దోసకాయ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది మలాన్ని నిలకడగా ఉంచుతుంది. మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. బీట్రూట్ – బచ్చలికూర రసం.. అల్పాహారంలో బీట్‌రూట్ జ్యూస్ తాగడం చాలా మంచిది. ఇది ఆకలిని అరికడుతుంది. ఇది చక్కెర కేలరీలు లేనిది. శరీరానికి సహజంగా శక్తిని అందిస్తుంది. బీట్‌రూట్‌లో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్, మాంగనీస్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం, సిలికాన్ సోడియం వంటి ఖనిజాలు లభిస్తాయి. అలాగే, బీట్‌రూట్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మలబద్ధకంతో సహా అనేక జీర్ణ సమస్యలను నివారిస్తుంది.

నిమ్మ – అల్లం రసం.. అల్లం శరీరంలో వేడిని పెంచే గుణం కలిగి ఉండటం వల్ల జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. అల్లం కడుపు నొప్పిని ప్రోత్సహించే తేలికపాటి భేదిమందు ప్రభావాలను కలిగి ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -