Salt: ఉప్పుతో వాస్తు దోషాలకు చెక్.. పండితులు ఏం చెబుతున్నారంటే?

Salt: మన వంటింట్లో దొరికే వాటిలో ఉప్పు ప్రధానమైనది అని చెప్పవచ్చు. ఇటువంటి ఆహార పదార్థాలు తయారు చేసినా కూడా ఉప్పును తప్పకుండా ఉపయోగిస్తూ ఉంటారు. ఉప్పు లేకుండా తయారుచేసిన ఆహార పదార్థాలు కనీసం తినడానికి ఏమాత్రం బాగుండవు అని చెప్పవచ్చు. కేవలం ఆహారం విషయంలో మాత్రమే కాకుండా వాస్తు శాస్త్రంలో కూడా ఉప్పుకు ప్రత్యేకమైన విశిష్ట స్థానం ఉంది. అందుకే మన పెద్దలు ఉప్పును కింద పడేయడం బయట విసిరేయడం లేదంటే తొక్కడం లాంటివి చేయకూడదని చెబుతూ ఉంటారు. అలాగే ఉప్పును చేతితో తీసుకోకూడదు. ఎందుకంటే ఉప్పును శనీశ్వరుడిగా భావిస్తారు.

 

అందుకే ఒకరి చేతి నుంచి మరొకరికి దాన్ని ఇవ్వకూడదని, అప్పుగా తీసుకోకూడదని అంటారు. అయితే, పూర్వకాలంలో ఉప్పు కొరత ఎక్కువగా ఉండేదట. దాని వల్ల చాలామంది ఉప్పును దొంగిలించేవారట. అది నివారించడం కోసమే ఉప్పును శనీశ్వరుడనే వదంతి పుట్టించారి చెబుతుంటారు. వాస్తు శాస్త్ర నిపుణులు ఉప్పుతో వాస్తు దోషాలను తొలగించవచ్చు అంటున్నారు. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ రోజుల్లో ఉప్పుకు కొరత లేదు. సముద్రపు ఉప్పుతో పాటు రాక్ సాల్ట్ కూడా అందుబాటులో ఉంటోంది. మరి ఉప్పుతో వాస్తు దోషాలను ఎలా దూరం చేసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉప్పు ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని దూరం చేసి పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది.

పడకగదిలో ఉప్పును ఉంచితే అనారోగ్యం దరిచేరదు. అలాగే ఎర్రరంగు వస్త్రంలో ఉప్పు కట్టి ఉంచి గుమ్మానికి వేలాడదీస్తే నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది. దిష్టి, చెడు ప్రభావాలు తొలగిపోతాయి. ఉప్పును వస్త్రంలో కట్టి పెట్టడం వల్ల కొందరికి అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఇంటి చుట్టూ ఉప్పును చల్లితే మొత్తం నెగటివ్ ఎనర్జీని అది లాగేసుకుంటుంది. అప్పుడు కష్టాలు ఉండవట. ఇంటి ముందు బకెట్ లేదా చిన్న పాత్రలో నీరు, ఉప్పు కలిపి ఉంచితే అది నెగటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది. ఆ ఉప్పు నీటిని ఎప్పటికప్పుడు మార్చాలి. ఎక్కడపడితే అక్కడ ఆ నీటిని పారబోయరాదు. శరీరంపై పడకుండా డ్రైనేజీ లేదా టాయిలెట్‌ లో పారబోయాలి.

 

అరచేతిలో ఉప్పు వేసుకుని కడిగితే డబ్బు రావడం మొదలవుతుందట. బాత్‌రూమ్‌లో ఉప్పు పెడితే ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ, వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో వివిధ ప్రాంతాల్లో ఉప్పును ఉంచితే ధనలాభం కలుగుతుంది. ఇంట్లోని డెకరేషన్ వస్తువులను అప్పుడప్పుడు ఉప్పు నీటితో కడిగితే పాజివ్ ఎనర్జీ ఇంట్లోనే ఉంటుంది. నిద్రపోయే ముందు గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి కాళ్లను పెట్టాలి. దీనివల్ల నిద్ర బాగా పడుతుంది. నెగటివ్ ఎనర్జీ కూడా దరిచేరదు. అయితే వాస్తుకు మంచిదె కదా అని అదేపనిగా ఇల్లంతా ఉప్పుతో నింపేసినా సమస్యే. నెగటివ్ ఎనర్జీని గ్రహించే ఉప్పును ఎప్పుడు కొద్ది మేరకు మాత్రమే ఉపయోగించాలి. అతిగా వాడితే ఉప్పు నెగటివ్ ఎనర్జీకి వాహకంగా మారే ప్రమాదం ఉందని వాస్తు పండితులు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Assembly Elections: ఏపీ నేతలను గజగజా వణికిస్తున్న నంబర్ల లెక్క ఇదే.. ఈ నంబర్లే నేతల రాత మారుస్తాయా?

Assembly Elections: ఆంధ్రప్రదేశ్లో నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసిపోయాయి. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలు 25 లోక్ సభ స్థానాలకు సంబంధించిన నామినేషన్లు భారీగానే దాఖలయ్యాయి. 175 అసెంబ్లీ స్థానాలకి 3084 మంది...
- Advertisement -
- Advertisement -