Chikoti Praveen: బీజేపీ తరపున పోటీ చేయనున్న చికోటి ప్రవీణ్.. ఎన్నికల్లో సంచలనాలు ఖాయమేనా?

Chikoti Praveen: చికోటి ప్రవీణ్ పరిచయం అవసరం లేని పేరు. గ్యాంబ్లింగ్ నిర్వాహకుడిగా, దేశ, విదేశాల్లో కాసినో నిర్వాహకుడిగా, గ్యాంబ్లింగ్ మాస్టర్ గా సమాజంలో చికోటి చాలా పాపులర్ అయ్యారు ఇలా గ్యాంబ్లింగ్ నిర్వహణలో భాగంగా చికోటి ప్రవీణ్ దేశవ్యాప్తంగా పాపులర్ అవ్వడమే కాకుండా అందరికీ పరిచయమయ్యారు. ఇకపోతే చికోటి ప్రవీణ్ రాజకీయాలలోకి రాబోతున్నారని తెలుస్తోంది.

వచ్చే ఎన్నికలలో బిజెపి తరఫున ఈయన పూర్తిగా నిలబడబోతున్నారని అయితే ఈ విషయాన్ని బిజెపి అధికారకంగా ప్రకటించకపోయినా ఈయన మాత్రం అధికారికంగా తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది అనే విషయాలను కూడా ప్రకటించారని తెలుస్తోంది. ఈయన వచ్చే ఎన్నికలలో జహీరాబాద్ ఎంపీగా కానీ లేకపోతే ఎల్బీనగర్ ఎంఎల్ఏగా కానీ బీజేపీ తరపున పోటీచేయబోతున్నట్లు ప్రకటించారు.

 

కామారెడ్డిలోని బిక్కనూరులో ఒక దేవాలయంలో పూజలు చేసిన సమయంలో చికోటి తన పోటీపై క్లారిటీ ఇచ్చారు.ఇలా ఈయన బిజెపి పార్టీలోకి పోవద్దు ఫలానా నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నానని ప్రకటించారు అయితే ప్రస్తుతం బిజెపి పార్టీకి కూడా అభ్యర్థుల అవసరం ఎంతగానో ఉంది. ఈ క్రమంలోనే ఈయనకు టికెట్లు కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

 

ఇలా వచ్చే ఎన్నికలలో బిజెపి తరఫున పోటీ చేయడానికి తెలంగాణలో అభ్యర్థులు లేరనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చికోటి ఇలాంటి వారికి టికెట్ తప్పకుండా ఇస్తారని కూడా తెలుస్తోంది. ఈమధ్యనే చికోటి ఢిల్లీకి వెళ్ళి బండి సంజయ్, డీకే అరుణలతో భేటీ అయ్యారు. చికోటికి టికెట్ ఇస్తే అడ్వాంటేజ్ ఉంటుందని ఆలోచనలో కూడా కేంద్రం ఉన్నట్టు తెలుస్తుంది ఈయనని పార్టీలోకి ఆహ్వానిస్తే పార్టీ ఫండ్ ఇవ్వాల్సిన పనిలేదు అంతగా అయితే పార్టీకి తిరిగి డబ్బు కూడా చెల్లించే స్థాయిలో ఉండటంవల్లే ఈయనకు టికెట్ ఇవ్వడానికి కేంద్రం నిరాకరించకపోవచ్చని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP: మే ఒకటో తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు.. జగన్ మాయలు మామూలుగా లేవుగా!

YSRCP:  మే 1, బుధవారం ఉదయం గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ ఫోన్స్ కి వస్తున్న మెసేజ్లను చూసి ఏం జరిగిందో తెలియని అయోమయంలో పడ్డారు. అయితే అసలు విషయం...
- Advertisement -
- Advertisement -