Uttar Pradesh: 5వ పెళ్లిని అడ్డుకున్న 2వ భార్య, పిల్లలు

Uttar Pradesh:  ఒకప్పుడు పెళ్లంటే నూరెళ్ల పంట అనేవారు. అంటే భార్యభర్తలు వందేళ్ల దాక కలిసి మెలిసి జీవిస్తారని.. నాడు అలానే జీవించేవారు. ఇద్దరిలో ఎవరికి కష్టమొచ్చినా ఒకరికొకరు సహాయం చేసుకుంటే తమ దాంపత్య జీవితాన్ని ముందుకు సాగించేవారు. కానీ.. నేటి కాలంలో కొందరు పెళ్లిలను అపహేళను చేస్తున్నారు. పెళ్లయిన కొన్ని ఏళ్లకే మరో పెళ్లికి సిద్ధమవుతున్నారు. మరి కొందరైతే పెళ్లయి కొన్ని వారాలలైనా కావు అప్పుడు ఇంట్లో తెలియకుండా మరో పెళ్లి చేసుకుని వేరే కాపురాలు పెడుతూ ఇద్దరి కుటుంబాల్లో చిచ్చురేపుతున్నారు. మరి కొందరు ప్రబుద్ధులు ఒకరికి తెలియకుండా ఒకరిని ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 5 పెళ్లిళ్లు చేసుకుని ఇంకో పెళ్లికి కూడా సిద్ధమవుతున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు సమాజం ఎటు పోతోందోనని. ఇలాంటి ఘటనే ఉత్తర్‌ ప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని మొహల్లా పాటియాకు చెందిన సుమారుగా 55 ఏళ్లు ఉన్న ఓ ప్రబుద్ధుడికి అప్పటికే నాలుగు పెళ్లిళ్లు అయ్యాయి. వివిధ కారణాలతో అందులో ఇద్దరికి విడాకులు కూడా ఇచ్చేశాడు. అంతటితో ఆగకుండా ఈ ముగ్గురు భార్యలకు తెలియకుండా మరో 2 పెళ్లిళ్లు చేసుకున్నాడు. రెండవ భార్యకు 5 మంది పిల్లలు కూడా ఉన్నారు.

ఈ క్రమంలో మరో పెళ్లికి సిద్ధమవుతుండగా విషయం తెలుసుకున్న రెండో భార్య ఆమె పిల్లలు పెళ్లి మండపానికి ఆ నిత్య పెళ్లికొడుకును విపరీతంగా చితకబాదారు. ఆ కొట్టుడుకు భయపడిని పెళ్లికూతురు అక్కడి నుంచి క్షణాల్లో మాయమైపోయింది. బంధువులు ఎంత ఆపినా ఆ రెండవ భార్య, పిల్లలు మాత్రం ఆ వ్యక్తిని ఘోరంగా కొట్టారు. స్థానికుల సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గాయాలకు గురైన నిత్య పెళ్లి కొడుకును ఆస్పత్రిలో చికిత్స చేయించి జైలుకు తరలించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -