Chiranjeevi-Balakrishna: ఒకే కథతో వస్తున్న చిరంజీవి బాలకృష్ణ.. కానీ?

Chiranjeevi-Balakrishna: ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ బరిలో రెండు పెద్ద సినిమాలు ఢీకొట్టబోతున్నాయి. ఇండస్ట్రీలో తిరుగులేని ఫాలోయింగ్ కలిగిన ఇద్దరు మాస్ హీరోలు మాస్ కథలతో సినీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైపోయారు. సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’గా వస్తుండగా, నందమూరి బాలయ్య ‘వీరసింహారెడ్డి’గా వస్తున్నాడు. ఈ రెండు సినిమాలకు సంబంధించిన ట్రైలర్లు మాస్ జనాలకు పిచ్చపిచ్చగా నచ్చేశాయి.

 

అయితే తాజాగా ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ మరియు ‘వీరసింహారెడ్డి’ సినిమాల కోర్ కథ ఒక్కటే అనే టాక్ ఇప్పుడు అందరిలో ఆసక్తిని పెంచుతోంది. ఒకే రకమైన కథను వేర్వేరుగా వడ్డించడంతో పాటు వేర్వేరు హీరోలతో సినిమాలు చేస్తున్నట్లు సమాచారం.

 

మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకు సంబంధించిన ఓ కథ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చకు దారి తీసింది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న పుకార్ల ప్రకారం.. సత్యరాజ్ మొదటి భార్యకు పుట్టిన వాల్తేరు వీరయ్య సరదాగా తిరిగే ఒక మత్స్యకారుడు. చిన్నపాటి స్మగ్లర్ కూడా. సత్యరాజ్ రెండో భార్య కొడుకు అయిన రవితేజ, చిరుల మధ్య ఢీ అంటే ఢీ అంటుంటారు. కానీ తమ్ముడికి కష్టం వచ్చినప్పుడు అన్నయ్య దానిని ఎలా పరిష్కరిస్తాడనేదే స్టోరీ అట.

 

అటు బాలయ్య ‘వీరసింహారెడ్డి’ కథ గురించి కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కథ ప్రకారం బాలయ్య తల్లి చనిపోగా తండ్రి మరో పెళ్లి చేసుకోవడం వల్ల వరలక్ష్మి శరత్ కుమార్ పుడుతుంది. చిన్నప్పటి నుండి అన్నంటే అస్సలు ఇష్టం లేని వరలక్ష్మి తన తండ్రి వీరసింహారెడ్డిని చంపడంతో కథ మలుపు తిరుగుతుందట. కానీ వారసుడిగా బాలసింహారెడ్డి ఎంట్రీ ఇవ్వడం, ప్రత్యర్థులతో పోరాడటం జరుగుతుందట.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -