Chiranjeevi: ఆ స్టార్ డైరెక్టర్, చిరంజీవి మధ్య అలాంటి అనుబంధం ఉందా?

Chiranjeevi: ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవికి కోట్లాది మంది అభిమానులున్నారు. ఆయన తన కెరీర్‌లో అనేక మంది దర్శకులు, హీరోయిన్లతో నటించారు. అందులో చిరంజీవి- డైరెక్టర్ కోదండరామిరెడ్డిలది అద్భుతమైన జోడి. ఖైదీ సినిమాతో తెలుగు సినీ చరిత్రలో ఓ కొత్త అధ్యాయానికి నాంది పలికారు. ఇది అప్పట్లో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. వీరిద్దరూ కలిసి సృష్టించిన అద్భుతాలు, నెలకొల్పిన రికార్డులకు లెక్కే లేదు. చిరంజీవిని మాస్ హీరోగా నిలబెట్టిన చిత్రాలు, స్టార్ డమ్ తెచ్చిపెట్టిన చిత్రాలన్నింటికీ ఏ కోదండరామిరెడ్డినే దర్శకుడు. ఖైదీ, అభిలాష, గూండా, దొంగ, ఛాలెంజ్, విజేత, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, కొండవీటి దొంగ, ముఠామేస్త్రి చిత్రాలన్నీ వీరి కాంబినేషన్‌లో వచ్చినవే.

 

ఆ ఫొటో అప్పట్లో వైరల్
వీరిద్దరి మధ్య చాలా మంచి స్నేహం కొనసాగుతూ ఉండేది. 1984లో రుస్తుం మూవీ షూటింగ్ అవుట్ డోర్‌లో నడుస్తుండగా, గ్యాప్‌లో కోదండరామిరెడ్డి సిగరెట్స్ తీసుకొచ్చి తాను ఒకటి నోట్లో పెట్టుకొని మరొకటి చిరంజీవికి ఇచ్చారు. స్వయంగా ఆయనే వెలిగించారు. ఆ పక్కనే ఉన్న ఆ చిత్ర హీరోయిన్ ఊర్వశి ఆసక్తిగా చూస్తూ ఉంటుంది. ఇలాంటి ఘటనలు ఎన్నో చిరంజీవి, కోదండరామిరెడ్డి మధ్య జరిగినప్పటికీ ఈ ఫొటో అప్పటి పత్రికల్లో పతాక శీర్షికల్లో వచ్చింది. వారి స్నేహానికి ఇదొక నిదర్శనమని వార్తలు వచ్చేవి.

అయితే వీరి కాంబినేషన్‌లో 1993లో వచ్చిన ముఠామేస్త్రి చిత్రం తర్వాత మరే సినిమా వారు కలిసి చేయలేదు. గొప్ప మిత్రులైన వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, అందుకే సినిమాలు చేయలేదనే ఒక వాదన ఉంది. అలాంటిదేమీ లేదు ఎదురుపడితే పలకరించుకుంటామని ఓ ఇంటర్వ్యూలో కోదండరామిరెడ్డి వెల్లడించారు. చిరంజీవి కూడా పలు సందర్భాల్లో కోదండరామిరెడ్డిని కొనియాడారు.

హిట్ కాంబినేషన్ అయిన చిరంజీవి, కోదండరామిరెడ్డి మధ్య సుదీర్ఘ విరామం రావడం అంటే మనస్పర్థల వార్తలు నిజమే అని పలువురు సినీ విశ్లేషకులు అంటూ ఉంటారు. అయితే దాని గురించి వారిద్దరూ ఎప్పుడూ స్పందించలేదు. సినిమాలు కుదరకే చేయలేదని చెప్పుకొచ్చారు. ఏదిఏమైనా చిరంజీవి, కోదండరామిరెడ్డి మర్చిపోలేని చిత్రాలు ప్రేక్షకులకు అందించారు. దర్శకుడిగా కోదండరామిరెడ్డి చివరి చిత్రం పున్నమి నాగు(2009). ఆయన కుమారుడు వైభవ్ హీరోగా కొనసాగుతున్నాడు. అతడు కోలీవుడ్ లో సెటిల్ కావడం విశేషం.

Related Articles

ట్రేండింగ్

The Land Titling Act: ఏపీ ఓటర్లకు అలర్ట్.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తెలుసుకుని ఓటేస్తే బెటర్!

The Land Titling Act: ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వము...
- Advertisement -
- Advertisement -