Chiranjeevi: వైరల్ అవుతున్న చిరంజీవి సంచలన వ్యాఖ్యలు!

Chiranjeevi: పవర్ స్టార్ పవన్ కల్యాణ్​ కు ఉన్న స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యువతలో పవన్ కు ఉన్న ఫాలోయింగ్, ఆయన సినిమాలకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఇన్ని ఉన్నా ఆయన మాత్రం అనుక్షణం ప్రజల బాగు కోసమే ఆలోచిస్తుంటారు. అందుకే సినీ అవకాశాలు ఎన్ని వస్తున్నా ఆయన మాత్రం ఆచితూచి చిత్రాలు చేస్తున్నారు.

 

ఒకవైపు మూవీ కెరీర్ ను కొనసాగిస్తూనే మరోవైపు రాజకీయాల్లోనూ పవన్ క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల మధ్య ఉంటూ, ప్రజా సమస్యల కోసం ఉద్యమిస్తూ నాయకుడిగానూ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అయితే ఏపీలోని అధికార వైఎస్సార్ సీపీ నేతలు మాత్రం పవన్ కల్యాణ్​ పై పదే పదే విమర్శలు చేస్తున్నారు.

 

పదవుల కోసం పవన్ పాలిటిక్స్ చేయట్లేదు: చిరు
పవన్ ను ప్యాకేజీ స్టార్ అంటూ అధికార పార్టీ లీడర్లు కామెంట్లు చేయడం ఇటీవల సాధారణమైపోయింది. తాజాగా ఈ ఉదంతంపై మెగాస్టార్ చిరంజీవి పరోక్షంగా స్పందించారు. ప్రజలకు మంచి చేయాలనే సదుద్దేశంతోనే పవన్ పాలిటిక్స్ లోకి వచ్చారని చిరు అన్నారు. డబ్బు, పదవులపై వ్యామోహంతో ఆయన రాజకీయాలు చేయట్లేదని.. కొన్ని నెలల కింద వరకు పవర్ స్టార్ కు సొంతిల్లు కూడా లేదని చిరంజీవి పేర్కొన్నారు. దీంతో ఏపీ అధికార నేతలు పవన్ పై చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన పరోక్షంగా స్పందించినట్లయ్యింది.

 

పవన్ పై నెగెటివ్ కామెంట్లు చేసిన వాళ్లతో మాట్లాడేందుకు కూడా తాను ఇబ్బంది పడుతున్నానని చిరంజీవి అన్నారు. ఉపాసన గర్భం దాల్చారనే వార్త తమ కుటుంబానికి ఎంతో సంతోషం కలిగించిందని మెగాస్టార్ పేర్‌‌కొన్నారు. ఆరు సంవత్సరాల నుంచి ఈ శుభవార్త వినేందుకు తాను ఎదురుచూస్తూ వచ్చానన్నారు. అది తెలిసిన వెంటనే సురేఖకు, తనకు కళ్లలో నీళ్లు వచ్చేశాయని చిరు వివరించారు.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts