Chiru-Charan: చరణ్ భవిష్యత్తు గురించి చిరంజీవి అలా అన్నారా.. ఆ మాటతో షాకయ్యేలా?

Chiru-Charan: టాలీవుడ్ ప్రేక్షకులకు హీరో రామ్ చరణ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. చిరుత సినిమా ద్వారా టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చరణ్.. మొదటి సినిమాతోనే తన నటనతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఇంకా చెప్పాలంటే ఆ సినిమాతోనే తనకంటూ కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన మగధీర సినిమాతో రామ్ చరణ్ స్టార్ హీరో స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఇక ఆపై పలు సినిమాల్లో నటించి నటనలో తండ్రికి తగ్గ కొడుకుగా తనకంటూ చెరగని ముద్ర సంపాదించుకున్నాడు చెర్రీ. ఇక ఇటీవల దర్శకు ధీరుడు రాజమౌళి పాన్ ఇండియా స్థాయిలో పరిచయం ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక నటుడుగా రామ్ చరణ్ కెరీర్ మొదలుపెట్టి 15 సంవత్సరాలు గడిచింది. ఈ సందర్భంగా తన తండ్రి చిరంజీవి ఎమోషనల్ కామెంట్లు ఒక ట్వీట్ ద్వారా తెలియజేశారు.

నటుడిగా చిరుత నుంచి మగధీర.. రంగస్థలం, RRR, తాజాగా డైరెక్టర్ శంకర్ తో ఆర్సి15 వరకు తనను తాను మార్చుకుంటూ చరణ్ ఎదిగే తీరు ఎంతో బాగుందని చిరంజీవి తెలియజేశాడు. చెర్రీ వర్క్ డెడికేషన్ చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపాడు. భవిష్యత్తులో చరణ్ మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకోవాలని తన కొడుకు గురించి తాను గర్విస్తున్నానని చిరంజీవి ఒక ట్వీట్ ద్వారా తెలియజేసాడు. ప్రస్తుతం చిరంజీవి చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక చరణ్ రాబోయే సినిమాల విషయానికొస్తే ఆర్ సి 15 అనే ప్రాజెక్టుతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కాగా ఈ సినిమాకు తమిళ అగ్రస్థాయి డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా రామ్ చరణ్ అభిమానులు ఏ సినిమాకు భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఆర్ఆర్ ఆర్ సినిమాలో తన నటనను మరో స్థాయిలో కనబరిచిన చరణ్. ఆర్సి15లో ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటాడో చూడాలి.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -