Ram Charan – Upasana: చరణ్ తో ఉపాసన బయోపిక్ నిర్మించడానికి అసలు కారణాలివేనా?

Ram Charan – Upasana: మెగా కోడలిగా ఉపాసన అందరికీ ఎంతో సుపరిచితమే. మెగా పవర్ స్టార్ రాంచరణ్ తీసిన ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఈమె మెగా కుటుంబంలోకి అడుగుపెట్టిన తర్వాత మెగా కుటుంబ పర్వ ప్రతిష్టలను ఉన్నత శిఖరాలకు చేరుస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఇకపోతే బిజినెస్లను నిర్వహిస్తూ అపోలో హాస్పిటల్ బాధ్యతలను కూడా చూసుకుంటున్నారు.

 

అపోలో హాస్పిటల్ ఫౌండర్ అయినటువంటి డాక్టర్ సి ప్రతాపరెడ్డి ఉపాసన తాతగారు అనే సంగతి మనకు తెలిసిందే. అయితే ఈయన ఇటీవల తన 91వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ క్రమంలోనే ఉపాసన చెన్నై వెళ్లి తన తాతయ్యకు పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. అనంతరం తన తాత పుట్టినరోజు సందర్భంగా ది అపోలో స్టోరీస్ అనే పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు.

ఈ పుస్తకంలో అపోలో హాస్పిటల్ స్థాపించడం హాస్పిటల్ అభివృద్ధి చెందడం గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు. అంతేకాకుండా తన తాతయ్య తన కూతుర్లకు స్ఫూర్తి కలిగించిన విషయాలను గురించి కూడా పొందుపరిచారు. ఇలా ఉపాసన ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన తర్వాత ఈమె ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఉపాసన మాట్లాడుతూ ఈ పుస్తకం చాలా స్ఫూర్తిదాయకమైనదని ప్రతి ఒక్క తండ్రి కూడా ఈ పుస్తకం చదవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

 

ఇక ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఫ్యూచర్లో మీ తాతయ్య బయోపిక్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయా అంటూ ఉపాసనకు ప్రశ్న ఎదురవడంతో తప్పకుండా ఉండవచ్చు అంటూ ఈమె తెలిపారు. ఇక ఈ బయోపిక్ సినిమాలో రామ్ చరణ్ నటిస్తారా అనే ప్రశ్న కూడా ఈమెకు ఎదురు కావడంతో అది డైరెక్టర్ విజన్ బట్టి ఉంటుందని ఉపాసన తెలిపారు. ఇలా తన తాతయ్య బయోపిక్ సినిమా అందులో రామ్ చరణ్ నటించడం ఉపాసన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -