TDP-BJP-Janasena: టీడీపీ జనసేన బీజేపీ సీట్ల లెక్క క్లారిటీ ఇదే.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించారంటే?

TDP-BJP-Janasena: టికెట్ల కేటాయింపులో జగన్ జెట్ స్పీడ్‌లో ఉన్నారు. కానీ.. టీడీపీ, జనసేన ఇంకా ముందుకు కదలేదు. దీనిపై ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సీట్ల కేటాయింపు వెనకబడితే.. అభ్యర్థులు ఎప్పుడు ప్రజల్లోకి వెళ్తారు? కార్యకర్తలను ఎప్పుడు సమాయత్తం చేస్తారని చర్చ నడుస్తోంది. అయితే, పక్కా ప్లాన్‌తోనే చంద్రబాబు, పవన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఏ హడావుడీ లేకుండా చంద్రబాబు, పవన్ కొన్ని స్థానాలను ప్రకటించారు. అక్కడ ఎలాంటి అసంతృప్తి లేకుండా అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు. మొదట టీడీపీ 2 స్థానాలు, తర్వాత జనసేన 2 స్థానాలు ప్రకటించాయి. ఆ స్థానాల్లో ఎలాంటి వర్గపోరు కానీ అసమ్మతిరాగాలు కానీ వినిపించడం లేదు. ఇక మంగళవారం కూడా నూజివీడు ఇంఛార్జ్‌గా చంద్రబాబు కొలుసు పార్థసారథి పేరును ప్రకటించారు. అక్కడ కూడా ఎలాంటి అసంతృప్తులు బయటకు రాలేదు. దీంతో.. ఈ పేర్లను చంద్రబాబు, పవన్ వ్యూహాత్మకంగానే ప్రకటించినట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో కార్యకర్తలు, ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికే తక్కువ స్థానాలను ప్రకటించారు. ఇప్పటికే సీట్లు కేటాయింపు పూర్తి అయిందని తెలుస్తోంది.

అయితే, పేర్లను ప్రకటించకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదట జగన్ అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తే.. దాని బట్టి టీడీపీ, జనసేన లిస్టు విడుదల చేయడానికి సిద్దంగా ఉన్నాయి. ప్రత్యర్ధిని బట్టి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చేయాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు.. బీజేపీ కూడా టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేసే అంశం దాదాపు ఖరారు అయింది. ఇది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే పవన్ కు అమిత్ షా నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది. పవన్ ఢిల్లీన తర్వాత పొత్తుపై ప్రకటన రానుంది. అప్పడు టికెట్లు కేటాయింపుపై కూటమి నేతలు ప్రకటనలు విడుదల చేస్తారు.

ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ముందు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. దీంతో.. బీఆర్ఎస్‌లో పలు స్థానాల్లో అసమ్మతి నేతలు తమ స్వరం వినిపించారు. దానికి తగ్గట్టు కాంగ్రెస్ అభ్యర్థులను తర్వాత ప్రకటించింది. మరో విషయం ఏంటీ అంటే.. కాంగ్రెస్ అభ్యర్థుల కంటే ముందు మ్యానిఫెస్టోను మొదట ప్రజల్లోకి తీసుకొని వెళ్లింది. రేపు కాంగ్రెస్ వస్తే ఏం జరుగుతుందో ప్రజలకు ఓ క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత అభ్యర్థి ఎవరు అయినా.. పథకాలను చూసి ప్రజలు ఓట్లు వేశారు.

కానీ, ఎన్నికలకు కొన్ని రోజుల ముందు వరకు కూడా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల చేయలేదు. అది పెద్ద సమస్యగా మారింది. సేమ్ ఏపీలో కూడా అభ్యర్థుల ఎంపికలో వేగంగా ఉన్న వైసీపీ.. ఇప్పటి వరకూ మ్యానిఫెస్టో ఏంటో చెప్పలేదు. కనీసం ఒక్క పథకాన్ని కూడా ప్రకటించలేదు. దానికి భిన్నంగా టీడీపీ చాలా రోజుల నుంచి మినీ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకొని వెళ్తుంది. ఇక సీట్లు విషయానికి వస్తే ఆయా పార్టీలకు క్లారిటీ ఉంది. టీడీపీ 140 అసెంబ్లీ, 18 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుందని తెలుస్తోంది. బీజేపీ 10 అసెంబ్లీ, 5 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇక, జనసేన 25 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో బరిలో దిగనుందని ప్రచారం జరుగుతోంది. ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది అంతే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -