YS Jagan: టీడీపీ కంచుకోటల్లో కొత్త ఇంఛార్జ్ లను నియమిస్తున్న జగన్.. ఇది వృథా ప్రయాస అంటూ?

YS Jagan: ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి తరుణంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ వ్యూహాలను అమలులోకి తీసుకువస్తున్నారు. ఇక రాజకీయ ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ఆర్ సమాధి వద్ద బస్సు యాత్ర ప్రారంభించారు అన్ని నియోజకవర్గాలలోను తమ జెండా ఎగిరే విధంగా జగన్ మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహాలను రచిస్తున్నారు.

అంతేకాకుండా అభ్యర్థుల నియామకాల లోనూ అలాగే నియోజకవర్గాల ఇన్ చార్జీల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఒకటికి రెండుసార్లు ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఇకపోతే టిడిపికి కంచుకోటగా ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

ఎక్కడైతే టీడీపీకి మంచి స్పందన ఉంటుందో అలాంటి చోట ఎమ్మెల్యే అభ్యర్థిని రాజకీయాల పరంగా ఎంతో అనుభవం ఉన్నటువంటి వారందరినీ ఇన్చార్జిగా నియమిస్తూ అక్కడ వైసీపీ జెండా నాటడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదాహరణకు వస్తే మంగళగిరిలో లోకేష్ ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అయితే లోకేష్ కు పోటీగా లావణ్యను నియమించిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పటికే లావణ్య ప్రచార కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు కానీ ఈ నియోజకవర్గంలో టిడిపికి కాస్త బలం ఉండడంతో ఈయన ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఈ నియోజకవర్గానికి ఇన్చార్జిగా నియమించి పార్టీ విజయానికి దోహదం చేస్తున్నారు. ఎక్కడైతే టిడిపికి అనుకూలంగా ఉంటుందో అక్కడ అభ్యర్థులతో పాటు మరి కొంత మంది సీనియర్ అనుభవం కలిగినటువంటి నాయకులను ఇన్చార్జిలుగా నియమిస్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి ఎంతమందిని రంగంలోకి దింపిన అది వ్యర్థమేనని ఈసారి ఆంధ్రాలో కూటమి విజయం ఖాయమైందనే చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -