CM Jagan : జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఎక్కడ జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా?

CM Jagan: చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు పలు శాఖలలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగాలను భర్తీ చేశారు. అయితే ఎవరికైతే ఉద్యోగం లేదు అలాంటి వారికి నిరుద్యోగ భృతి కల్పించారు. ఇలా నిరుద్యోగ భృతి ద్వారా కొంతమంది శిక్షణ తీసుకుంటూ ఉద్యోగాలలో స్థిరపడ్డారు కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే నిరుద్యోగాన్ని నిర్మూలిస్తానని ప్రతి ఏడాది జనవరి ఒకటో తేదీ జాబ్ కాలండర్ ఉంటుందంటూ మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చారు.

ఇలా మాయమాటలతో నమ్మించి మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల గురించి పట్టించుకోవడమే మానేశారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అని ఆ మాటే మర్చిపోయారు. అంతేకాకుండా మెగా డీఎస్సీ అని ప్రకటించిన జగన్ మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయలేదు.

తీరా ఎన్నికలకు నెల ముందు 6000 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి వాటిని కూడా కొన్ని కారణాల వల్ల కోర్టులో ఆగిపోయేలా చేసారు. ఇలా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి ఎంతోమంది యువత నిరుత్సాహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా డీఎస్సీ విషయంలో ఎంతోమంది అభ్యర్థులు ఎన్నో ఆశలు పెట్టుకొని పరీక్షలకు సిద్ధమయ్యారు.

ఇలా డీఎస్సీ వస్తుందని ఎదురు చూసినటువంటి వారికి అది ఆశగానే మిగిలిపోయిందని చెప్పాలి. ఇలా అధికారంలోకి రావడం కోసం ఉద్యోగాలంటూ నిరుద్యోగులను రెచ్చగొట్టి వారి అందరి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తనతో పాటు తన పార్టీ నేతల స్వలాభం కోసమే ఐదేళ్లు కష్టపడ్డారు కానీ నిరుద్యోగుల కోసం ప్రజల కోసం జగన్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని పలువురు నిరుద్యోగులు నిలదీస్తున్నారు. ఇప్పటికే డీఎస్సీ విషయంలో ఎంతోమంది నిరుద్యోగులు రోడ్డుపైకి వచ్చిన సంగతి తెలిసిందే. వారందరికీ జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారో తెలియాల్సి ఉంది. ఇక త్వరలోనే ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలో నిరుద్యోగులే జగన్మోహన్ రెడ్డికి తమ పవర్ ఏంటో ఓటు ద్వారా చూపించబోతున్నారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP: మే ఒకటో తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు.. జగన్ మాయలు మామూలుగా లేవుగా!

YSRCP:  మే 1, బుధవారం ఉదయం గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ ఫోన్స్ కి వస్తున్న మెసేజ్లను చూసి ఏం జరిగిందో తెలియని అయోమయంలో పడ్డారు. అయితే అసలు విషయం...
- Advertisement -
- Advertisement -