CM Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ కార్పొరేట్ విద్య అంటే ఇదేనా.. ఏకంగా ఇంత చేశారా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాలలను కార్పొరేటర్ విద్యాసంస్థలకు ధీటుగా తీర్చిదిద్దామని నాడు నీడలో భాగంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా కార్పొరేట్ స్థాయిలో ఉన్నత చదువులు చదువుతున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారాలను చేస్తూ ఉన్నారు అధికారంలోకి రావడంతో పాఠశాలలకు రంగులు మార్చారు కానీ విద్యా ప్రమాణాలను మాత్రం మార్చలేదని చెప్పాలి.

ఇలా జగన్మోహన్ రెడ్డి చెప్పినంత దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దలేదని తాజాగా పదో తరగతి పరీక్ష ఫలితాలే చెబుతున్నాయని పలువురు వైసిపి పై అలాగే జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. విద్యా రంగంలో కీలకమైన బోధనా వ్యవహారాన్ని పట్టించుకోలేదు జగన్ ప్రభుత్వం. ఉపాధ్యాయులకు బోధనేతర సిబ్బంది బాధ్యతలు అప్పగించింది. దీంతో ప్రభుత్వ పాఠశాలలు టెన్త్ ఫలితాలు తీవ్రంగా నిరాశపరిచాయి.

ప్రభుత్వ పాఠశాలలలో ఈ ఏడాది పదో తరగతి ఉత్తీర్ణత శాతం కేవలం 79.38శాతం మాత్రమే నమోదు కాగా ప్రవేట్ పాఠశాలలలో ఏకంగా 96. 72 శాతం ఉత్తీర్ణత నమోదు కావటం విశేషం. ఇలా ఈ ఉత్తీర్ణత శాతం చూస్తుంటే ఏపీలో ప్రవేట్ పాఠశాలలకు దీటుగా తమ ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దామని జగన్మోహన్ రెడ్డి చెప్పినది మొత్తం డొల్ల అని స్పష్టంగా తేటతెల్లమవుతుంది.

తక్కువ మంది విద్యార్థులు ఉంటే రెసిడెన్షియల్, బీసీ సంక్షేమ మేనేజ్ మెంట్ పాఠశాలలో 98.43శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. 2803 పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణులు కాగా అందులో 1988 ప్రైవేట్ పాఠశాలలే ఉండటం గమనార్హం. నాడు నేడు కింద జగన్మోహన్ రెడ్డి ఆ పాఠశాలలను చాలా ఉన్నతంగా తీర్చిదిద్దామని చెబుతున్నారు తప్ప అవన్నీ కేవలం మాటలకు మాత్రమే పరిమితమయ్యాయి తప్ప విద్యార్థులో ప్రమాణాలను ఏమాత్రం మెరుపు పరచలేదని అందుకే ఉత్తీర్ణత శాతం ప్రభుత్వ పాఠశాలలో పూర్తిగా పడిపోయిందని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -