CM YS Jagan: సీఎం జగన్ నయా ప్లాన్.. ఎమ్మెల్యేలతో సరికొత్త ప్రయోగం

CM YS Jagan: వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిచి అధికారాన్ని నిలుపుకునే దిశగా సీఎం వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు. మొన్నటివరకు ప్రభుత్వ పాలనపై దృష్టి కేంద్రీకరించిన జగన్.. ఇప్పుడు కాస్త పార్టీకి కూడా టైమ్ కేటాయిస్తున్నారు. సీఎం అవ్వగానే ప్రభుత్వ పాలన చూసకోవడంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. అందుకే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, పార్టీలో లోతుగా ఏం జరుగుతుందో పట్టించుకునే తీరిక ఉండదు. ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలకే టైమ్ సరిపోతుంది. మూడేళ్ల వరకు పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమాలకే సమయం కేటాయించిన జగన్… ఇప్పుడు ఎన్నికలకు రెండేళ్లు ఉండగానే పార్టీపై మళ్లీ దృష్టి పెంచారు.

పార్టీలో ఏం జరుగుతుంది.. ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అనే దానిపై ప్రశాంత్ కిషోర్ టీమ్ చేత రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. ఇక నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించిన వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం పనిచేయాలని సూచిస్తున్నారు. వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల స్థానంలో వచ్చే ఎన్నికల్లో కొత్తవారికి జగన్ సీటు కేటాయిస్తారనే ప్రచారం మొన్నటివరకు సాగుతూ వచ్చింది. దాదాపు 30 మంది ఎమ్మెల్యేలపై నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉందని, వచ్చే ఎన్నికల్లో వారికి సీట్లు కేటాయిస్తే గెలిచే పరిస్థితి లేదని పీకే సర్వేలలో తేలిందట. అందుకే ఆ 30 మంది ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీుటు దక్కదనే వార్తలు వినిపించాయి.

కానీ అనూహ్యంగా జగన్ వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను వేరే నియోజకవర్గంలో బరిలోకి దింపనున్నారు. దాని వల్ల కొత్త నియోజకవర్గంలో ప్రజల నుంచి సానుకూలత ఉండే అవకాశం ఉంటుందని స్ట్రాటజీ రూపొందించారు. ఇక ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎంపీలను అసెంబ్లీకి పోటీ చేయించనున్నారు. ఖాళీ అయిన పార్లమెంట్ సీట్లలో ఎమ్మెల్యేలు, మంత్రులను పోటీ చేయించే అవకాశముంది. దాదాపు 60 నియోజవకర్గాల్లో ఇలా వేరే నియోజకవర్గానికి చెందిన నేతను బరిలోకి దింపేందుకు జగన్ ప్లాన్ చేసినట్లు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

తాడికొండలో ఉండవల్లి శ్రీదేవిపై వ్యతిరేకత ఉండటంతో ఆమెను ప్రత్తిపాడు నుంచి పోటీ చేయించే అవకాశముంది. ఇక ప్రత్తిపాడు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న హోంమంత్రి సుచరితను వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయించనున్నారట. ఇక తాడికొండ నుంచి డొక్కా మాణిక్యవరప్రసాద్ లేద ప్రస్తుతం బాపట్ల ఎంపీగా ఉన్న నందిగం సరేష్ ని బరిలోకి దింపే అవకాశాలున్నాయి. ఇక మంత్రి మేరుగ నాగార్జునను బాపట్ల ఎంపీగా పోటీ చేయించేందుకు వైసీపీ సిద్దమవుతోందని ఆ పార్టీల్లో ప్రచారం సాగుతోంది.

ఇక అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ ను వేరే స్థానంలో పోటీ చేయిస్తారని, ఆ సీటును ఎంపీ సత్యవతికి ఇస్తారనే టాక్ నడుస్తోంది. ఇక విశాఖ ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యానారాయణను విశాఖ తూర్పు నుంచి పోటీ చేయించే ఆలోచనలో వైసీపీ ఉంది. విశాఖ ఎంపీగా అవంతి శ్రీనివాస్ ను పోటీలోకి దింపే అవకాశముంది. ఇక విజయనగరం ఎంపీ బెల్లాల చంద్రశేఖర్ ను ఎచ్చెర్ల నియెజకవర్గం నుంచి, ఇక కురుపాం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పుష్ప శ్రీవాణిని అరకు ఎంపీగా పోటీలోకి దింపాలని జగన్ భావిస్తున్నారు. వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలను ఇలా షిప్ట్ చేయాలని జగన్ అనుకుంటున్నారట.

ఎంపీలు, ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో మళ్లీ సీటు ఇవ్వకపోతే ఆ క్యాడర్ వేరే పార్టీ వైపు మళ్లే అవకాశముంది. వేరే పార్టీకి నేతలు సపోర్ట్ చేసే అవకాశముంటుంది. దీంతో అప్పటినుంచి వైసీపీతో ఉన్న ఓటు బ్యాంక్ వేరే పార్టీకి వెళ్లే అవకాశముంటుంది. అందుకే వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల పట్ల సాఫ్ట్ కార్నర్ తో ముందుకెళ్లాలనే ఆలోచనలో జగన్ ఉన్నారట. కూల్ గా వారిని డీల్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు వైసీపీ శ్రేణుల్లో చర్చ నుడుస్తోంది.

– వై. పార్వతి, సీనియర్‌ జర్నలిస్ట్‌ (arshtunnu2000@gmail.com)

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -