CM YS Jagan: వచ్చే ఎన్నికలే లక్ష్యంగా సీఎం జగన్ మాస్టర్ ప్లాన్.. వారిపై కీలక నిర్ణయం

CM YS Jagan:  వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందేందుకు సీఎం వైఎస్ జగన్ ఇప్పటినుంచే వ్యూహలు పన్నుతున్నారు. అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటూ ఎన్నికల కోసం కసరత్తు చేస్తోన్నారు. టీడీపీ, జనసేనతో పాటు విపక్ష పార్టీలన్నీ ఏకమవుతున్న క్రమంలో జగన్ అప్రమత్తమయ్యారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి వైసీపీని గెలిపించి రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు స్కెచ్ లు రూపొందిస్తున్నారు. ప్రభుత్వ పరంగా అధికారంలో ఉండటంతో ప్రభుత్వ పథకాలతో వివిధ హామీలతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోన్నారు. పెండింగ్ లో ఉన్న హామీలపై దృష్టి పెట్టారు.

పెండింగ్‌లో ఉన్న నిర్ణయాలను అమలు చేసేందుకు కసరత్తులు చేస్తోన్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బోయలు, వాల్మీకీలను ఎస్టీ జాబితాలో చేర్చే దిశగా జగన్ అడుగులు వేస్తోన్నట్లు తెలుస్తోంది. మూడు జిల్లాల్లో ఉన్న బోయులు, వాల్మీకీలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ఇప్పటికే జగన్ సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది. దీనిపై అధ్యయనం కోసం ఏకసభ్య కమిటీని ఇప్పటికే జగన్ ప్రబుత్వం నియమించింది. తమను ఎస్టీ జాబితాలో చేర్చాల్సిందిగా బోయలు, వాల్మీకీలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోన్నారు. అంతేకాదు దీనిపై ఆందోళనలు కూడా చేస్తోన్నారు.

ప్రస్తుతం బోయలు, వాల్మీకీలు బీసీ జాబితాలో ఉన్నారు. బీసీ జాబితాలో ఉండటం వల్ల రిజర్వేషన్ తక్కువగా ఉంది. అదే ఎస్టీ జాబితాలో చేర్చిస్తే రిజర్వేషన్ పెరుగుతోంది. దీని వల్ల ఉద్యోగాల్లో, విద్యాసంస్థలో అవకాశాలు పెరుగుతాయి. బోయలు, వాల్మీకీలు కర్ణాటకలో ఉండగా.. అక్కడ ఎస్టీలుగా ఉన్నారు. దీంతో ఏపీలోనూ తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకీలు, బోయలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోన్నారు. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలో ఈ రెండు సామాజికవర్గాల ప్రజలు ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దాదాపు జిల్లాలో కలిపి మొత్తం 50 లక్షలకు పైగా మంది ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి. మిగతా జిల్లాలో అక్కడక్కడ ఉన్నా.. తక్కువమందే నివసిస్తున్నారు.

1956కి ముందు బోయలు,. వాల్మీకీలు ఎస్టీ జాబితాలోనే ఉండేవారు. కానీ ఇంధ్రా రీజీయస్ ఎస్టీ, ఎస్సీ సవరణ చట్టం ప్రకారం 1956లో వీరిని ఎస్టీ జాబితా నుంచి తొలగించి బీసీల జాబితాలో చేర్చారు. కానీ తమను తిరిగి ఎస్టీల జాబితాలో చేర్చాలంటూ వాల్మీకీ, బోయలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కూడా చేస్తోన్నారు. ఎప్పటినుంచో దీనిపై పోరాటాలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు వారిని ఎస్టీ జాబితాలో చేర్చడం ద్వారా ఆ రెండు సామాజికవర్గాల ఓట్లు సంపాదించుకోవచ్చని జగన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారిని ఎస్టీ జాబితాలో చర్చడం కోసం అధ్యయనం చేసేందుకు ఏకసభ్య కమిషన్ నియమించింది. వారి నుంచి వచ్చిన రిపోర్టు తర్వాత ఆ రెండు సామాజికవర్గాల ప్రజలను ఎస్టీల జాబితాలో చేర్చుతూ నిర్ణయం తీసుకోనున్నారు.

గత ఎన్నికల్లో ఈ రెండు సామాజికవర్గాల ప్రజలు వైసీపీకి ఓటు వేసినట్లు గుర్తించారు. దీంతో వారి ఓట్లు కీలకంగా బావిస్తోన్న జగన్.. వారిని ఎస్టీలో చేర్చడం ద్వారా మరోసారి వైసీపీకి ఓట్లు వేస్తారని భావిస్తున్నారు. కమిటీ ఇచ్చిన తీర్పు తర్వాత దానికి కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు.రిజర్వేషన్ పరిధిలో కేంద్రంలో ఉంటుంది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్రపతి సంతకం పెట్టాల్సి ఉంటుంది. అందుకే నివేదిక తర్వాత కేంద్రానికి ప్రతిపాదన పంననున్నారు. కేంద్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -