CM Jagan: జగన్ ఒంటరితనానికి స్వయంకృతాపరాధమే కారణమా.. ప్రజలు కూడా వదిలేయబోతున్నారా?

CM Jagan: వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కే కార్యక్రమానికి వెళ్లిన లేదంటే ఏ కార్యక్రమానికి వెళ్లిన తాను ఒంటరి వాడినని తనకు ప్రజలే సైనికులుగా నిలవాలి అంటూ పెద్ద ఎత్తున ప్రజలను ఉద్దేశించి సానుభూతిపరమైన మాటలు మాట్లాడుతూ ఓట్ల కోసం తాను ఒంటరి వాడినని తనకు మీరంతా అండగా నిలవాలని కోరారు. ఇలా జగన్మోహన్ రెడ్డి ఒంటరివాడు అవ్వడానికి గల కారణం ఏంటి అనే ప్రశ్న ఆయనే వేసుకుంటే తనకే సమాధానం దొరుకుతుందని పలువురు ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు.

జగన్మోహన్ రెడ్డి గతంలో జైలుకు వెళ్ళగా ఆయనకు తోడుగా తన చెల్లెలు నిలబడి కాళ్లు అరిగేలా పాదయాత్ర చేశారు కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత తన చెల్లిని దూరం పెట్టారు అలాగే తన పార్టీల నుంచి తన తల్లిని కూడా దూరం పెట్టారు. అంతేకాకుండా ఎన్నికలకు ముందు తన బాబాయ్ వివేకానంద రెడ్డిని తన రాజకీయ ప్రయోజనం కోసం హత్య చేయించి తన బాబాయిని దూరం చేసుకున్నారు.

ఇలా తన బాబాయ్ మరణంతో తనకు సునీత రెడ్డి రూపంలో మరో శత్రువు పెరిగిపోయారు.. ఇక తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయామం నుంచి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి వంటి వారందరూ కూడా ఎంతో సన్నిహితంగా ఉండేవారు వారందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి పలు కారణాలతో పార్టీ నుంచి బయటకు పంపించేశారు.

ఇలా జగన్మోహన్ రెడ్డి చేతులారా తన చుట్టూ తన అనుకున్న వారందరిని కూడా దూరం పెడుతూ వచ్చారు. ఇలా అందరిని దూరం పెడుతూ వచ్చి నేను ఒంటరి వాడిని నన్ను మీరే ఆదుకోవాలి మీరే సైనికులుగా ముందుకు నడిపించాలి అంటూ చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఒంటరి అవ్వడానికి ఆయన వ్యవహార శైలి కారణమని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -