CM Jagan: జగన్ కుటుంబ ఆస్తుల విలువ లెక్క ఇదే.. ఆయన కూతుళ్ల పేర్లపై ఉన్న ఆస్తులివే!

CM Jagan: జగన్మోహన్ రెడ్డి మాట మాట్లాడితే ఇది పెత్తందారులకు పేదలకు మధ్య జరుగుతున్న పోరాటం అని మాట్లాడుతూ ఉంటారు పేదల ప్రతినిధిని అంటూ ఏ సభకు వెళ్లిన జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు ఇవే అయితే పేదల ప్రతినిధి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పేరిట కేవలం 500 కోట్లకు పైగా ఆస్తులు ఉండటం గమనార్హం. జగన్మోహన్ రెడ్డి తరఫున వైయస్ మనోహర్ రెడ్డి సోమవారం జగన్ తరఫున నామినేషన్ దాఖలు చేశారు.

జగన్మోహన్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్లు ఆయన ఆస్తుల వివరాలను వెల్లడించారు. మరి జగన్ పేరిట ఆయన సతీమణి అలాగే పిల్లల పేరిట ఎంత మొత్తంలో ఆస్తులు ఉన్నాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. కేవలం జగన్మోహన్ రెడ్డి పేరిట మాత్రమే రూ.529.87 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు ఈ అఫీడవిట్ లో పేర్కొన్నారు. ఇక తన భార్య భారతి , కుమార్తెలు వైయస్ హర్షిని రెడ్డి, వైయస్ వర్షా రెడ్డి పేరు మీద ఉన్న ఆస్తులను కలిపితే ఏకంగా 757.65 కోట్ల రూపాయలకే తెలుస్తుంది.

ఇలా వందల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి వారు పేదవారు అనడం ఒక జగన్మోహన్ రెడ్డికి మాత్రమే చెల్లింది. అయితే 2019 సంవత్సరంలో వీరందరి ఆస్తులు విలువ 510.38 కోట్లు కాగా 2024 సంవత్సరానికి వీరి ఆస్తుల విలువ 757. 65 కోట్లకు పెరగటం గమనార్హం. ఇలా ఆస్తులు మాత్రమే కాకుండా వీరిద్దరూ కూడా పలు కంపెనీలలో పెట్టుబడులను భారీ స్థాయిలో పెట్టారు.

వైయస్ జగన్ ఏడు కంపెనీలలో పెట్టుబడులు పెట్టగా తన భార్య భారతి ఏకంగా 22 కంపెనీలలో పెట్టుబడులు పెట్టారు. అలాగే తన కుమార్తె హర్షిని రెడ్డి 7 కంపెనీలలో వర్షా రెడ్డి 9 కంపెనీలలో పెట్టబడులు పెట్టారు. అంతేకాకుండా వీరి ఇద్దరి కుమార్తెలకు విదేశాలలో కూడా భారీ స్థాయిలో ఆస్తులు ఉండటం విశేషం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నటువంటి ఆస్తులు విలువ ఈ స్థాయిలో ఉంటే ఈయన అంతకుమించే ఆస్తులను కూడబెట్టి ఉంటారని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -