CM Jagan: వైసీపీ నేతలపై కేసులన్నీ ఎత్తేసేలా ప్లాన్స్.. జగన్ మరీ ఇంతలా దిగజారారా?

CM Jagan: ఒకప్పుడు వైసిపి నేతలపై పెద్ద ఎత్తున కేసులు ఉండేవి అయితే ప్రస్తుతం మాత్రం అత్యంత సంచలనం సృష్టించిన కేసులు తప్ప వైసిపి నేతలపై ఏ విధమైనటువంటి కేసులు లేవని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్నికల నామినేషన్ ప్రక్రియ జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సిపి అభ్యర్థులందరూ కూడా నామినేషన్ దాఖలు చేస్తున్నారు. అయితే ఈ నామినేషన్ దాఖలు చేస్తున్నటువంటి సమయంలో వారి ఎన్నికల అఫిడవిట్లలో తమపై విధమైనటువంటి కేసులు లేవని చెప్పుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

గతంలో ఒక్కో నేతపై సుమారు అయిదారు కేసులో ఉండేవి అయితే ఇప్పుడు మాత్రం వారిపై ఏ విధమైనటువంటి కేసులు లేవని తెలుస్తోంది. మరి వీరిపై ఉన్నటువంటి ఈ కేసులు అన్నిటినీ ప్రభుత్వం ఎప్పుడు ఉపసంహరించుకుందో తెలియదు పైగా రహస్యంగా ఉపసంహరించుకున్నట్టు ఉత్తర్వులు జారీ చేస్తుందో కూడా తెలియదు కానీ వీరిపై ఏ విధమైనటువంటి కేసులు లేవని చెప్పుకు వస్తున్నారు.

గతంలో వైయస్ అవినాష్ రెడ్డి పట్ల ఐదారు కేసులు ఉండేవి ప్రస్తుతం వివేక హత్య కేసు ఆరోపణలు తప్ప ఏ విధమైనటువంటివి లేవు అలాగే జగన్మోహన్ రెడ్డి పై కూడా కేవలం సిబిఐ కేసులు మాత్రమే ఉంటాయేమో చూడాలి. ఇలా వైఎస్ఆర్సిపి నేతలపై ఏ విధమైనటువంటి కేసులో లేకపోవడమే కాకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి అధికారులపై కేసుల జాతర జరిగింది. కేవలం చంద్రబాబు నాయుడు మీద మాత్రమే ఏకంగా 24 కేసులు పెట్టారు.

ఇలా వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు అన్నింటినీ లేకుండా చేసుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆయన క్రిమినల్ చేతికి పదవులు అప్ప.జెబితే వ్యవహారం ఇలాగే ఉంటుందంటూ పలువురు ఈ విషయంపై కామెంట్లు చేయడమే కాకుండా వైసిపి నేతలు చివరికి ఇంతలా దిగజారిపోయారా అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -