CM KCR: ఆ నలుగురు ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ.. టీ పాలిటిక్స్‌లో మొదలైన చర్చ

CM KCR: బుధవారం సాయంత్రం నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యలను కొనుగోలు చేస్తూ బీజేపీ అడ్డంగా పోలీసులకు దొరికిపోయిన ఘటన తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. దాదాపు ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు బీజేపీ ఆఫర్ చేసి తమ పార్టీలో చేరుకునేందుకు గాలం వేయడం కలకలం రేపుతోంది. మెయినాబాద్ లోని ఓ ఫామ్‌హౌస్‌లో నలుగురు ఎమ్మెల్యేలతో టీఆర్ఎస్ మంతనాలు జరుపుతుండగా.. పోలీసులు విశ్వననీయ వర్గాల ద్వారా సమాచారం అందుకుని దాడి చేపట్టారు. ఈ దాడిలో ఇద్దరు స్వామిజీలను పోలీసులతో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సన్నిహితంగా ఉండే మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ వ్యవహారంపై ఇప్పటికే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి.. దీని వెనుక ఎవరు ఉన్నారు అనే కోణాల్లో సైబరాబాద్ పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇంకెతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేశారు అనే విషయాన్ని కూడా ఆరా తీస్తున్నారు. పోలీసులు విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.

అయితే నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన వ్యవహారంపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. దీనిపై తెలుసుకునేందుకు నలుగురు ఎమ్మెల్యేలను ప్రగతిభవన్ కు పలిచారు. నలుగురు ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ కావడం టీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాయంత్రం ఈ నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశముందని తెలుస్తోంది. ఈ క్రమంలో కేసీఆర్ మీడియా సమావేశంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఆ నలుగురు ఎమ్మెల్యేలతో కేసీఆర్ ఏం మాట్లాడారు అనేది టీఆర్ఎస్ వర్గాల అందరిలోనూ జోరుగా జరుగుతోంది.

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బుధవారం రాత్రి తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసున్న క్రమంలో నలుగురు ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే ఈ కేసుపై తెలంగాణ హైకోర్టులో బీజేపీ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తో విచారణ చేయించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను నియమించాలని పిటిషన్ లో కోరారు.

ఇక నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కీలకంగా మారాయి. దీని వెనుక టీఆర్ఎస్ కుట్ర ఉందని, తమకు ఆ ఘటనతో ఎాలాంటి సంబంధం లేదని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి తాము ప్రయత్నించలేదని, అవసరమైతే యాదాద్రిలో ప్రమాణం చేస్తానంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. దమ్ముంటే కేసీఆర్ కూడా యాదాద్రికి వచ్చి ప్రమాణం చేయాలని బండి సంజయ్ ఛాలెంజ్ చేశారు. మునుగోడులో టీఆర్ఎస్ ఓడిపోతుందనే భయంతోనే కేసీఆర్ తమను ఇరికించాలని ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ఫామ్ హౌస్ టీఆర్ఎస్ నేతలదేనని, పోలీసులకు కంప్లైంట్ చేసింది కూడా వాళ్లేనని అనుమానం వ్యక్తం చేశారు.

శుక్రవారం ఉదయం 9 గంటలకు యాదాద్రికి వెళ్తున్నామని, కేసీఆర్ కూడా రావాలని సూచించారు. కేసీఆర్ రాకపోతే ఆయన బండారం బయటపడినట్లేనని బండి సంజయ్ తెలిపారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ చేపించాలని బండి డిమాండ్ చేశారు. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు తాము ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -