CM KCR: దద్దమ్మలా నోరు మూసుకుని ఉన్నారు.. కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

CM KCR: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కోదాడలో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించింది. ఈ సభకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దద్దమ్మలా నోరు మూసుకుని ఉన్నారంటూ కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ రాకముందు 2003లో సాగర్‌ నీళ్ల కోసం రైతులు నా దగ్గరకు వచ్చారు. అప్పుడు నేను 24 గంటల్లో నీళ్లు ఇవ్వాలని అప్పటి ప్రభుత్వానికి వార్నింగ్‌ కూడా ఇచ్చాను అని కెసిఆర్ తెలిపారు. నాగార్జున సాగర్‌ పేరు నదిగొండ ప్రాజెక్టని ఏలేశ్వరం దగ్గర ప్రాజెక్టు కట్టాల్సి ఉండగా, గోల్‌మాల్‌ చేసి 20 కిలోమీటర్లు దిగువకు తీసుకొచ్చి నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు కట్టారని ఆయన విమర్శించారు.

దీంతో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందని కెసిఆర్ అన్నారు. మనం కట్టాలనుకున్న ప్రాజెక్టును ఆపిందెవరు. ప్రాజెక్టును ఆపితే నోరు మూసుకొని కూర్చున్నదెవరని నిలదీశారు. అయితే ఇంత జరుగుతున్నా కూడా అప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు నోరు మూసుకుని పడి ఉన్నారని, దద్దమ్మల్లా ఒక మాట కూడా మాట్లాడలేదని మండిపడ్డారు కెసిఆర్. అలాగే ఆరోజు కాంగ్రెస్‌ పాలకులు చేసిన తప్పులకు ఇప్పుడు మనం శిక్ష అనుభవిస్తున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2001లో నేను గులాబీ జెండా ఎగరేసి ఈ అన్యాయాలపై నిలదీసిన దాక అడిగిన మొగోడే లేడు. ఈ జిల్లాలో మంత్రులు లేకుండెనా? చాలా మంది ఉండె.

సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రులతో ఎవరూ కొట్లాడలేదు. నల్గొండ జిల్లాకు నీళ్లు తేలేదు. రైతులు కోరితే మొన్న సాగర్‌నుంచి నీళ్లు విడుదల చేశాం. మరోసారి నీళ్లను విడుదల చేస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను ను రప్పించాలని కోరుతున్నారు. కాళేశ్వరం నీళ్లు వస్తే రెండు పంటలు పండుతాయి. మల్లయ్య యాదవ్‌ గెలవరంటూ చాలామంది అన్నారు. గెలవకున్నా పర్లేదు టికెట్‌ ఇస్తానని అని చెప్పాను. మలయ్య యాదవ్‌ను గెలిపిస్తే కోదాడలో బీసీ భవన్‌ కట్టిస్తాను. నీళ్ల కోసం కోదాడనుంచి హలియా వరకు పాదయాత్ర చేశాను తెలంగాణకు బీఆర్‌ఎస్‌ శ్రీరామ రక్ష అని చెప్పుకొచ్చారు కెసిఆర్. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ ఆయనను ఆవేదన వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -