CM KCR: కేసీఆర్ కొత్త పార్టీ వెనుక అసలు ఉద్దేశం ఇదేనా?

CM KCR: సీఎం కేసీఆర్ త్వరలో కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. దసరా రోజు ఆయన కొత్త పార్టీ ఏర్పాటు ప్రకటన చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రైత ఎజెండాతో కేసీఆర్ కొత్త పార్టీ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. పార్టీ ప్రకటన రోజునే పార్టీ జెంగా, గుర్తు, విధివిధానాలను కేసీఆర్ ప్రకటించనున్నారనే ప్రచారం టీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతోంది. పార్టీ ప్రకటించిన తర్వాత దేశవ్యాప్తంగా కేసీఆర్ పర్యటన మరోసారి ఉంటుందని, ప్రాంతీయ పార్టీల నేతలందరినీ కలుస్తారని తెలుస్తోంది. తన పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా అందరినీ కోరుతారని సమాచారం.

దేశవ్యాప్తంగా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తారని, మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతారని చెబుతున్నారు. త్వరలో గుజరాత్ లో పాటు పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రైతులను తమ పార్టీ తరపున కేసీఆర్ పోటీలోకి దింపుతారని, వారికి అయ్యే ఖర్చును కేసీఆర్ నే బరిస్తారనే టాక్ నడుస్తోంది. జాతీయ రాజకీయాల్లోకి మోదీకి వ్యతిరేకంగా త్వరలో కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. బంగారు భారత్ కోసం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తారని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. కేసీఆర్ కొత్త పార్టీ వెనుక అసలు ప్లాన్ వేరేది ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కేసీఆర్ పార్టీ పోటీలోకి దిగితే రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు మద్దతిచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే పార్టీలన్నీ తమ పార్టీని బలపర్చుకునేందుకే ప్రయత్నాలు చేస్తాయి. ఇతర పార్టీలను మద్దతు ఇచ్చేందుకు ఆసక్తి చూపవు. కానీ కేసీఆర్ తన పార్టీకి ప్రాంతీయ పార్టీల మద్దతు కోరుతున్నారు. దీని వెసుక అసలు ప్లాన్ మరొకటి ఉందని అంటున్నారు.

కేసీఆర్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయదని, కేవలం ప్రత్యామ్నాయ వేదికగా మాత్రమే ఉంటుందని అంటున్నారు. మోదీని ఎదుర్కునేందుకు అందరూ ఒకచోటకు రావాల్సిన అవసరం ఉంటుంది. అన్ని పార్టీలు కలిసి ఒక వేదిక మీదకు రావాల్సి ఉంటుంది. కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ప్రత్యామ్నాయ వేదికగానే ఉంటుందని, అంతేకానీ ఎన్నికల్లో పోటీ చేయడదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం ప్రతపక్ష నేతలందరికీ ఏకం చేసేందుకు కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నారు.

కేసీఆర్ కొత్త జాతీయ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే దేశవ్యాప్తంగా చాలా సమయం పడుతుంది. ఎన్నో ఏళ్లు శ్రమ పడాల్సి ఉంటుంది. ఇప్పుడు అంత సమయం కేసీఆర్ కు లేదు. అందుకే కేవలం ప్రత్యామ్నాయ ఫ్రంట్ గానే కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ఉండనుదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతు్న్నారు. బీజేపీని ఎదుర్కొనేందుకు, అధికారంలోకి దించేందుకు కేసీఆర్ ప్రత్యామ్నాయ శక్తిని మాత్రమే ఈ కొత్త జాతీయ పార్టీ ద్వారా ఏర్పాటు చేయనున్నారనేది తెలు్తోంది. కానీ చాలా పార్టీలు కేసీఆర్ ను కలిసి వచ్చేందుకు నిరాకరిస్తున్నాయి.

నితీష్ కుమార్, మమతా బెనర్జీ, స్టాలిన్, కుమారస్వామి, అఖిలేష్ యాదవ్ లాంటి నేతలందరూ కాంగ్రెస్ తో సంబంధమున్న నేతలే. అలాంటి వాళ్లు కాంగ్రెస్ ను వదులుకుని కేసీఆర్ తో కలిసి వచ్చేందుకు ముందుకు రావడం లేదు. కాంగ్రెస్ ను కూడా కూటమిలో కలుపుకోవాలని వారు సూచనలు చేస్తున్నారు. దీంతో కేసీఆర్ ప్రత్యామ్నాయ కూటిమికి మద్దతు లభించడం లేదు. దేశ రాజకీయాల్లో నితీస్ కుమార్, మమతా లాంటి వారు తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. కేసీఆర్ తో కలిసి వచ్చేందుకు నిరాకరిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -