CM KCR-Jr NTR: ఎన్టీఆర్ పై గురి పెట్టిన కేసీఆర్.. ఇక ఇబ్బందులు తప్పవా?

CM KCR-Jr NTR: అమిత్ షాను కలిసినందుకు జూనియర్ ఎన్టీఆర్ పై సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నారా? ఎన్టీఆర్‌పై టార్గెట్ పెట్టారా? సినిమా పరంగా ఎన్టీఆర్ ను ఇబ్బందులు పెడుతున్నారా? బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇటీవల అమిత్ షాను ఎన్టీఆర్ కలిసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవవడం రాజకీయంగా చర్చ జరుగుతోంది. బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంటకు ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా వస్తున్నందున కావాలనే పోలీసులపై ఒత్తిడి చేసి తెలంగాణ సర్కార్ ఈవెంట్ కు అనుమతి ఇవ్వలేదనే అనుమానాలు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఎన్టీఆర్ వస్తున్నందున భారీగా అభిమానులు వచ్చే అవకాశముందనే కారణంతో భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు అనుమతి నిరాకరించి ఉండొచ్చని, దీనిని రాజకీయం చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు.

ఏది ఏమైనప్పటికీ ఇటీవల అమిత్ షాను ఎన్టీఆర్ కలిసిన నేపథ్యంలో అతడు అతిథిగా హాజరుకావాల్సిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ రాజకీయ రచ్చకు దారి తీసింది. మనుగోడు ఉపఎన్నికల క్రమంలో అక్కడ బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొనేందుకు తెలంగాణకు వచ్చిన అమిత్ షాను హైదరాబాద్ లో జూనియర్ ఎన్టీఆర్ కలవడం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. సినిమాల పరంగా కలిశారని బీజేపీ శ్రేణులు చెబుతున్నప్పటికీ.. దీని వెనుక రాజకీయ కోణం కూడా ఉందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. సినిమాల కోసమే అయితే కలవాల్సిన పనిలేదని, ఖచ్చితంగా ఏదో ఒక రాజకీయ అంశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ నటనకు మెచ్చి కలిశారని కమలం వర్గాలు చెబుతున్నప్పటికీ.. ప్రజలెవ్వరూ దానిని నిమ్మడం లేదు. ఫోన్ చేసిన ప్రశంసించవచ్చని, దానికి కలవాల్సిన అసవరం లేదు కదా అని ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణలో అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ.. కమ్మ సామాజికవర్గం, టీడీపీ ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్టీఆర్ తో భేటీ నిర్వహించిందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ వర్గాలు కూడా అమిత్ షా, ఎన్టీఆర్ భేటీపై దృష్టి పెట్టాయి. మోదీ సర్కార్ పై గత కొంతకాలంగా కేసీఆర్ దమ్మెత్తిపోస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా విరిచుకుపడుతున్నారు. దీంతో అమిత్ షాను కలిసినందుకే ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరుకవాల్సిన బ్రహ్మాస్త్ర ప్రిరిలీజ్ ఫంక్షన్ కు ప్రభత్వం పోలీసులతో అనుమతి ఇవ్వకుండా చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమా యూనిట్ ప్లాన్ చేసుకుంది. శుక్రవారం సాయంత్రం ఈవెంట్ జరగాల్సి ఉంది. కొద్దిరోజుల ముందుగానే పోలీసులు అనుమతి ఇవ్వడంతో సినిమా యూనిట్ ఏర్పాట్లు చేసుకుంది. ఈవెంట్ కోసం కోట్లు ఖర్చు పెట్టి భారీ సెట్టింగ్ వేసుకుంది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కొన్ని గంటల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో చివరి నిమిషంలో పోలీసులు అనుమతి ఇవ్వలేదు. వినాయక మండపాల దగ్గర సిబ్బంది ఉన్నారని, ఈవెంట్ కు ప్రజల్ని కంట్రోల్ చేయలేమంటూ పోలీసులు చెప్పుకొచ్చారు. ముందుగా అనుమతి ఇచ్చిన పోలీసులు.. ఎన్టీఆర్ గెస్ట్ గా వస్తున్నారనే తెలిసే అనుమతి ఆపేశారనే విమర్శలు వస్తున్నాయి.

కానీ ఈ సినిమాలో నాగార్జున నటించారు. తెలంగాణ ప్రభుత్వంతో నాగార్జునతో సత్సంబంధాలు ఉన్నాయి. నాగార్జున అనుకుంటే పోలీసులు అనుమతి ఇచ్చేవారని, ఇందులో ఎందులో రాజకీయం లేదని అంటున్నారు. బ్రహ్మాస్త్ర సినిమాలో ఎన్టీఆర్ నటించలేదు. జస్ట్ ఎన్టీఆర్ కు ఉున్న క్రేజ్ దృష్టా సినిమాను ప్రమోట్ చేసేందుకు తారక్ ను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు. సినిమాతో ఎన్టీఆర్ కు ఎలాంటి సంబంధం లేదు. అలాంటప్పుడు అమిత్ షాను కలిసినందుకే అనుమతి ఇవ్వలేదనే అంశం విడ్డూరంగా ఉందని వాదనలు వినిపిస్తున్నాయి.

– వై. పార్వతి, సీనియర్‌ జర్నలిస్ట్‌ (arshtunnu2000@gmail.com)

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -