CM KCR: వాళ్లను టార్గెట్ చేసిన సీఎం కేసీఆర్.. అదే జరగబోతుందా?

CM KCR: తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ మధ్య గత కొంతకాలంగా విభేదాలు తలెత్తుతున్న విషయం మనకు తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం పని తీరుపై గవర్నర్ తమిళసై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ పనితీరు గవర్నర్ మధ్య విభేదాలు చోటు చేసుకోవడంతో పలు బిల్లులను ఆమోదించాల్సిన గవర్నర్ వాటిని పెండింగ్లో పెడుతూ వచ్చారు. అయితే తాజాగా గవర్నర్ల వ్యవహార శైలిపై మంత్రి కేటీఆర్ బహిరంగంగా చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రాజ్యాంగ పదవులు కేంద్రం చేతిలో రాజకీయ సాధనాలుగా మారిపోయాయి అంటూ తమిళనాడు ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని ఈయన ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ గవర్నర్ల తీరు పై చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బిజెపి యేతర రాష్ట్రాలను చూస్తే కేంద్రం సహాయ నిరాకరణ ప్రతీకరం స్పష్టంగా కనపడుతోందని ఈయన ఈ సందర్భంగా తెలియచేశారు. ఇలా కేటీఆర్ గవర్నర్ల వ్యవహారి శైలిపై ఈ విధమైనటువంటి ట్వీట్ చేయడానికి కారణం లేకపోలేదు.
తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ మధ్య విభేదాలు ఉన్న నేపథ్యంలో చాలా కాలంగా రాజ్ భవన్ లో ఆమోదించాల్సిన పలు బిల్లులు పెండింగ్ పడుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా తమిళనాడు గవర్నర్ తమిళసై మూడు సాధారణ బిల్లులపై ఆమోదముద్ర వేశారు. కీలకమైన యూనివర్సిటీల నియామక బిల్లు అటవీ వర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన రెండు బిల్లులను రాష్ట్రపతికి నివేదించడం కోసం నిలిపివేశారు.
మరొక రెండు బిల్లులు రాష్ట్ర వివరణ కోరడం కోసం తిరిగి వెనక్కి పంపించారు. ఈ రెండు బిల్లలను అంతర్గతంగా పరిశీలించాలని తెలియజేశారు. ఇలా రాష్ట్రాలలో పలు బిల్లలు ఆమోద విషయంలో గవర్నర్ తీరుపై  తెలంగాణ ప్రభుత్వం చాలా అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఈ విధమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే తమిళనాడులో కూడా ఇదే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో చట్టసభలలో ఆమోదించిన బిల్లులు తీర్మానాలపై ఆమోదముద్ర వేయడం కోసం గవర్నర్ కు కాలపరిమితి నిర్ణయించాలని రాష్ట్రపతి కేంద్రాన్ని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం తీర్మానం చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ తీర్మానాన్ని కేసీఆర్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -