Dharmapuri Arvind: కేసీఆర్ సచ్చిపోతే 5 లక్షలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అరవింద్ బంపర్ ఆఫర్!

Dharmapuri Arvind:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే విషయం ఏమిటంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు, ఆయన కుమారుడు కే. తారక రామారావు చనిపోతే లక్షల డబ్బు బహుమతిస్తుందని బీజేపి నేత నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు అరవింద్ ధర్మపురి వివాదానికి తెర లేపారు.

ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం టీఆర్ఎస్ ప్రకటించిన మేనిఫెస్టో ని ప్రస్తావిస్తూ భారత రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖర రావు పై మండిపడ్డారు. బీఆర్ఎస్ తన మేనిఫెస్టోలో కేసీఆర్ భీమా పథకం కింద చనిపోయిన రైతుల కుటుంబాలకు 5 లక్షల జీవిత బీమా హామీ ఇస్తుందని పేర్కొన్నారు అయితే మరణించిన రైతు 56 లోపు వయసు ఉండాలని..

అప్పుడే ఆ కుటుంబాలకు భీమా ఇస్తామని బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పేర్కొన్నారు అని బీజేపీ నేత అరవింద్ ఆరోపించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో పై ధర్మపురి అరవింద్ మండిపడుతూ కేసీఆర్ చనిపోతే భాజాపా 5 లక్షలు ఇస్తుందని, కేటీఆర్ చనిపోతే ఆ మొత్తాన్ని 10 లక్షలు పెంచుతామని చెప్పుకొచ్చారు. ఇంకా మాట్లాడితే కేసీర్ కు సమయం దగ్గర పడ్డది. చిన్న వారు చనిపోతే ఎక్కువ విలువ, ఎక్కువ డబ్బు. ఆయన మాట ప్రకారమే కవిత చనిపోతే నేను 20 లక్షలు ప్రకటిస్తాను అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మీ బిడ్డ, కొడుకు తెలంగాణకు పట్టిన చెదలు అంటూ ఆగ్రహించారు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మద్యం బంద్ చేయాలని, ఎలక్షన్ కమిషన్ కు నా విజ్ఞప్తి అని తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది అని చెప్పారు. అలాగే ఎలక్షన్స్ అయ్యేవరకు ఓటర్లకు మధ్యాన్ని పంచుతూ వాళ్లని తాగుబోతుల్లాగా తయారు చేస్తున్నారు అంటూ ఆగ్రహించారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -