Byreddy Siddharth Reddy: వైరల్ అవుతున్న బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Byreddy Siddharth Reddy: వైఎస్ఆర్ సీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చంద్రబాబు నాయుడు పై సెటైర్లు వేస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఆయనకి ఉన్న మేనేజ్మెంట్ స్కిల్స్ మరెవరికి లేవంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనానికి తెర తీస్తున్నాయి. అసలు ఏం జరిగిందంటే తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమిపై పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు సిద్ధార్థ రెడ్డి. హైదరాబాద్ వరదల సమయంలో కేసీఆర్సర్కార్ బాధితులకు పరిహారం ఇస్తే సగం డబ్బును అధికారులు, నాయకులు కాజేశారని వ్యాఖ్యానించారు.

అయితే ఆంధ్రప్రదేశ్ అలాంటి దుస్థితిలో లేదన్నారు. భాజాపా, కాంగ్రెస్ ను చెరొక చంకలో పెట్టుకొని నడుపుదామని అనుకోవటం చంద్రబాబు గొప్పతనం. ఆయనకి ఉన్న మేనేజ్మెంట్ స్కిల్స్ మరెవరికి లేవు అని ఎద్దేవా చేశారు. పార్టీ టికెట్లు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అని చంద్రబాబు నాయుడు మాకు చెప్పవలసిన అవసరం లేదని చెప్పుకొచ్చారు బైరెడ్డి. వచ్చే రెండు నెలలలో ఎన్నికలు రాబోతున్న క్రమంలో చంద్రబాబు రాష్ట్రమంతటా తిరిగి వైఎస్ఆర్ సీపీ లో ఎవరికి టిక్కెట్ ఇవ్వాలి ఎవరిని ఎక్కడ నిలబెట్టాలి అని ఆయన చెబితే మేము వినాలన్నట్లుగా మాట్లాడుతున్నారు.

 

అయితే జగన్ కి పూర్తిగా రాజకీయాల పట్ల స్పష్టత ఉంది జగన్ కి అన్ని విషయాలు తెలుసు. అబద్ధపు హామీలు ఇవ్వడం ఇష్టం లేక 2014 లో జగన్ అధికారంలోకి రాలేకపోయారు అని తమ నేతని వెనకేసుకొచ్చాడు జగన్. చంద్రబాబు నాయుడు భాజపా పెద్దలపై, పవన్ కళ్యాణ్ పై ఆధారపడ్డాడు.

 

ఒకపక్క బీజేపీ వాళ్ళతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్న చంద్రబాబు గురించి, షర్మిల గురించి ఎలా మాట్లాడాలని విషయంతో రేవంత్ రెడ్డికి చెప్పి పంపిస్తున్నారని బైరెడ్డి తీవ్రంగా ఆరోపించారు. తెలంగాణలో గత ప్రభుత్వం చేసిన పనులకు ఏపీలో జగన్ సర్కారు చేసిన పనులకు ఎంతో తేడా ఉంది. ఏపీలో ప్రభుత్వ స్కూల్స్ లో అడ్మిషన్లు ఫుల్ అయ్యాయి అనే బోర్డు పెట్టారు ఇది పక్క రాష్ట్రమైన తెలంగాణలో జరగలేదు అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఎండగట్టారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -