Revanth Reddy: తెలంగాణ రాకుంటే కేసీఆర్ బిచ్చమెత్తుకునేటోడు.. రేవంత్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

 Revanth Reddy: సోనియాగాంధీ తెలంగాణను ఇవ్వకపోతే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా వద్దనో, బిర్లా మందిర్ వద్దనో అడుక్కునేదని రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లక్ష కోట్ల రూపాయలు, వేలాది ఎకరాల భూములు ఎలా వచ్చాయో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ఎవరు అని అడుగుతున్నా కేటీఆర్ ని ఒక సన్నాసి అంటూ తీవ్రంగా విమర్శించాడు రేవంత్ రెడ్డి. అంతేకాకుండా దేశానికి గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు ఏమిటో తెలుసుకోవాలని చెప్పారు.

అలాంటి గాంధీ కుటుంబానికి ఇల్లు కూడా లేదని కానీ 10 ఏళ్లలోనే ఫామ్ హౌస్ లు కట్టుకున్న చరిత్ర కేసీఆర్ కుటుంబానిదని దుయ్యబట్టారు తెలంగాణ రాకపోతే అమెరికాలో బాత్రూములు కడుక్కునే వాడివి కేటీఆర్ అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హైదరాబాద్ కి ఏం చేసింది అని అడుగుతున్నాడు కేటీఆర్, ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు ఎవరు ఇచ్చారు అన్నది మర్చిపోయినట్లు ఉన్నాడు సన్నాసోడు. ఈ దేశానికి నాయకత్వలోపం ఏర్పడినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు నాయకత్వం వహించే బాధ్యత తీసుకున్నారు.

అంతేకాకుండా రాష్ట్రపతి ప్రధానమంత్రి లాంటి పదవులను త్యాగం చేసి మన్మోహన్ సింగ్, పీవీ నరసింహారావు లాంటి మేధావులని ప్రధానమంత్రిని చేసింది. అలాంటి వాళ్ళ బిడ్డని ఎవరు అని అడుగుతాడా సన్నాసోడు. దేశం కోసం నెహ్రూ జైలుకు పోయారు.ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణత్యాగం చేశారు. మన సోనియా అమ్మ పదవి త్యాగం చేశారు. మన సోదరుడు రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి పదవి అలంకరించే అవకాశం వచ్చినా దానిని వదులుకొని ప్రజా ప్రతినిధిగా నిలబడి నరేంద్ర మోడీకి దీటుగా నిలబడ్డారు.

అలాంటి ఆయనకి ఈరోజు ఉండటానికి ఇల్లు కూడా లేదు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి పెద్ద పెద్ద ఫామ్ హౌస్ లో సంపాదించుకున్న మీరు రాహుల్ గాంధీ ఎడమకాలి గోటికి కూడా సరిపోరు. అలాంటి రాహుల్ గాంధీని పట్టుకొని వాడు ఎవడు అని అడుగుతావా నీకు ఎంత బలిసింది? అంటూ తనదైన రేంజ్ లో రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. మరి దీనిపై తండ్రి కొడుకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -