Colors Swathi: ఆ ఒక్క తప్పు వల్లే కలర్ స్వాతి ఇండస్ట్రీకి దూరమైందా?

Colors Swathi: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలుదొక్కుకోవాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్లకు ఇండస్ట్రీలో లైఫ్ స్పాన్ చాలా తక్కువ. అందుకే ఉన్న సమయంలోనే వారు వరుస అవకాశాలను అందుకొని సినిమా ఇండస్ట్రీలో అగ్ర తారగా పేరు సంపాదించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొందరు ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికి వారి కంఫర్ట్ జోన్ దాటి మరి సినిమాలు చేస్తుంటారు.

మరి కొందరు మాత్రం ఈ కంఫర్ట్ జోన్ దాటి నటించడానికి ఇష్టపడరు. అలాంటివారు ఇండస్ట్రీలో చాలా తక్కువ కాలం పాటు కొనసాగుతారని అనంతరం ఇండస్ట్రీలో అవకాశాలు రాక పూర్తిగా వెండితెరకు దూరమవుతారని చెప్పాలి. ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే అవకాశాలను కోల్పోయిన వారిలో నటి కలర్స్ స్వాతి ఒకరు. ఈమె కలర్స్ అనే కార్యక్రమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి గుర్తింపు పొందారు.

ఈ గుర్తింపుతో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలను అందుకొని అనంతరం హీరోయిన్ గా పలు సినిమాలలో నటించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించారు.అయితే గత కొంత కాలం నుంచి ఈమెకు ఏ విధమైనటువంటి సినిమా అవకాశాలు లేవని చెప్పాలి.ఇలా ఈమె అవకాశాలు కోల్పోవడానికి కారణం ఈమెకు తన కంఫర్ట్ జోన్ దాటి నటించే సినిమా అవకాశాలు రావడంతో అలాంటి సినిమాలను పూర్తిగా తిరస్కరించారు. ఇలా వచ్చిన అవకాశాలను చేతులారా వదులుకొని తప్పు చేశారని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -