Colors Swathi: ఆ ఫోటోలు డిలీట్ చేసిన కలర్స్ స్వాతి.. సమంత, నిహారిక బాటలో?

Colors Swathi: సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ప్రేమ వివాహాలు చేసుకోవడం మనం చూస్తున్నాము అయితే సెలబ్రిటీలు ఎంత తొందరగా అయితే ప్రేమలో పడతారో అంతే తొందరగా విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇలా ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి మనకు తెలిసిందే.

సమంత నాగచైతన్య మనస్పర్ధలు కారణంగానే ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ విడాకులు తీసుకున్నారు. తాజాగా మెగా డాటర్ నిహారిక కూడా విడాకులు తీసుకుని విడిపోయిన విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా నిహారిక విడాకుల వార్తలు మర్చిపోకముందే మరొక స్టార్ కపుల్స్ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

సినీ ఇండస్ట్రీలో యాంకర్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనంతరం హీరోయిన్గా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి కలర్స్ స్వాతి వికాస్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని విదేశాలలో స్థిరపడిన విషయం తెలిసిందే. అయితే వీరి వైవాహిక జీవితంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇకపోతే గత కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని అందుకే విడాకులకు సిద్ధమయ్యారు అంటూ ఓ వార్త వైరల్ గా మారింది.

 

ఇలా కలర్స్ స్వాతి తన భర్త వికాస్ కు విడాకులు ఇస్తున్నటువంటి తరుణంలో ఈమె ఇండియాకి వచ్చి తిరిగే సినిమాలలో నటిస్తున్నారని సమాచారం.తన భర్తతో విభేదాలు రావటం వల్లే కలర్స్ స్వాతి సోషల్ మీడియాలో తన భర్తతో కలిసి ఉన్నటువంటి ఫోటోలు అన్నింటిని డిలీట్ చేశారని తెలుస్తుంది. ఇలా ఈ ఫోటోలన్నీ డిలీట్ చేయడంతో ఈమె కూడా సమంత నిహారిక బాటలోనే ఫోటోలన్నింటినీ డిలీట్ చేశారని వారిలాగే ఈమె కూడా విడాకులకు సిద్ధమయ్యారు అంటూ ఓ వార్త సంచలనంగా మారింది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -