Comedian Ali: అంగరంగ వైభవంగా కూతురికి నిశ్చితార్థం జరిపిన అలీ.. హాజరైన సెలబ్రిటీలు?

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి అనంతరం తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో కమెడియన్ గా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు అలీ. చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రారంభమైన తన కెరియర్ ఇప్పటికీ పలు సినిమాలలో కమెడియన్ గా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నారు.

ఇకపోతే అలీ భార్య జుబేదా గురించి పరిచయం అవసరం లేదు ఈ మధ్యకాలంలో ఈమే వరుస యూట్యూబ్ వీడియోలతో పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా అలీ ఫ్యామిలీ విషయానికి వస్తే ఈయనకు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అనే విషయం మనకు తెలిసిందే. ఇక అలీ పెద్ద కుమార్తె ఫాతిమా తాజాగా తన డాక్టర్ కోర్స్ పూర్తి చేసుకొని డాక్టర్ అయిన విషయాన్ని తెలియచేశారు. ఇలా పెద్దమ్మాయి డాక్టర్ గా స్థిరపడిగా మిగతా ఇద్దరు ప్రస్తుతం చదువులు కొనసాగిస్తున్నారు.

ఇకపోతే అలీ తన పెద్ద కుమార్తె ఫాతిమాకు ఆగస్టు 25వ తేదీ హైదరాబాద్ లోని కోహినూరు హోటల్ లో ఎంతో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరిపించినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా ఈ వీడియోని జుబేదా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేయడంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. అలీ తన పెద్ద కుమార్తె ఫాతిమాకు షేక్ షహయాజ్ అనే వ్యక్తితో నిశ్చితార్థం జరిపించారు.

ఎంతో ఘనంగా తన కూతురు నిశ్చితార్థ వేడుకను జరిపినట్లు తెలుస్తోంది.ఇకపోతే అలీ కుమార్తె నిశ్చితార్థం వేడుకకు ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు. ఇక ఈ నిశ్చితార్థ వేడుకల్లో భాగంగా పలువురు సెలబ్రిటీలు హాజరయ్యి పెద్ద ఎత్తున సందడి చేశారు. ప్రస్తుతం అలీ కూతురు నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది చూసిన ఎంతోమంది నెటిజన్ లు అలికి కాబోయే అల్లుడు ఏం చేస్తున్నారు అని ఆరా తీయడమే కాకుండా, ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12


Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -