Chalaki Chanti: ఆ షో తీరుని ఎప్పటికీ మర్చిపోలేను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన చంటి?

బుల్లితెరపై జబర్దస్త్ లో చేసి పాపులర్ అయిన వాళ్ళలో చలాకి చంటి ఒకడు. తన ఇమిటేషన్ తో కరెక్ట్ టైం లో పంచులు వేయడం తన సొంతం. మొత్తానికి ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం బుల్లితెరపై ఓ వెలుగు వెలుగుతున్నాడు చలాకి చంటి.

తన అద్భుతమైన కామెడీతో బుల్లితెర పై నవ్వులు పండిస్తూ.. ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నాడు చంటి. ఇక చంటి అసలు పేరు విజయ మోహన్. బుల్లితెర జబర్దస్త్ ద్వారా ప్రేక్షకులకు చలాకీ చంటిగా పరిచయం అయ్యాడు. ఏదేమైనా చంటి కి బుల్లితెరపై ఉన్న ర్యాపో అంతా ఇంతా కాదు.

అనంతరం చంటి వెండితెరపై కూడా అడుగుపెట్టి.. పలు సినిమాలో ఆఫర్లను తన సొంతం చేసుకున్నాడు. వెండితెరపై నవ్వులు పూయిస్తూ కమెడియన్ గా తనకంటూ ఓ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక తాజాగా చంటి బిగ్ బాస్ సీజన్ 6 కి ఎంటర్ అయ్యాడు. ఈ క్రమంలో గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చంటి మల్లెమాల టీం గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

జబర్దస్త్ మల్లెమాల తనకి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేదని తెలిపాడు. అతడు మల్లెమాల టీంలో చేసేటప్పుడు తనకి ఇతర ఆఫర్లు ఏమైనా వస్తే.. తనకు బాగా సపోర్ట్ చేసేవారు అని తెలిపారు. అంతేకాకుండా తను బయటికి వెళ్లినప్పుడు.. ఏమాత్రం కోప్పడకుండా యువర్ ఆల్వేస్ వెల్కమ్ అని మల్లెమాల టీం చెప్పినట్లు తెలిపాడు.

అంతేకాకుండా ఇంత గుర్తింపు సంపాదించి పెట్టిన మల్లెమాలను నేనప్పటికీ మర్చిపోలేనని తెలిపాడు. ఈ క్రమంలో మల్లెమాల టీం కి తనకు ఉన్న అనుబంధాన్ని వివరించాడు చంటి. ఇక వ్యక్తిగతంగా ఎన్నో కష్టాలు పడి ప్రస్తుతం బుల్లితెర జబర్దస్త్ లో వెలుగుతున్న చంటి ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా వెలగబోతున్నాడు. మరి బిగ్ బాస్ షో లో చంటి ప్రేక్షకులను ఏ విధంగా నవ్విస్తాడో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -