Chalaki Chanti: బిగ్ బాస్ కోసం చలాకీ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా?

Chalaki Chanti: బిగ్ బాస్ సీజన్ 6లో ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న కంటెస్టెంట్ ఎవరన్నా ఉన్నారంటే అది చలాకీ చంటి. జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా ఎంతో పాపులర్ అయిన చలాకీ చంటి.. బిగ్ బాస్ హౌజ్ లో అదరగొట్టేస్తాడని అందరూ అనుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 6లో ఈసారి కామెడీ చేయడానికి చంటి సరైన వ్యక్తి అని అందరూ అనుకున్నారు.
నిజానికి బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం కావడానికి ముందు నలుగురు కమెడియన్లను అనుకున్నా చివరకు చలాకీ చంటిని ఫైనలైజ్ చేశారు. అయితే చంటి మీద ముందు నుండి పాజిటివిటీ ఉన్నా కానీ హౌజ్ లోకి వెళ్లిన తర్వాత అతడు మాత్రం అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. గొడవల్లో అనవసర చర్చకు చంటి తెర తీసే వాడు. అలాగే లాజిక్ లేని మాటలతో చిరాకు తెప్పించే వాడు.
అటు టాస్కుల్లో కూడా చలాకీ చంటి పెద్దగా పోరాడింది లేదు. ఏదో ఆడాలంటే ఆడాలి అన్నట్లుగా చలాకీ చంటి టాస్కుల్లో ఉండే వాడు. అన్నింటికి మించి బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇస్తే.. అందులో కూడా సక్సెస్ కాలేదు. దీంతో అతడి మీద బిగ్ బాస్ కు నమ్మకం పోవడంతో పాటు జనాల్లో ఫాలోయింగ్ తగ్గింది. దీంతో చలాకీ చంటి బిగ్ బాస్ హౌజ్ నుండి ఎలిమినేషన్ ద్వారా బయటకు వచ్చేశాడు.
చలాకీ చంటికి బిగ్ బాస్ వల్ల బాగానే కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న వారిలో చలాకీ చంటి కూడా ఉండగా.. అతడు వారానికి రూ.50వేల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ హౌజ్ లో 5 వారాలు ఉన్న నేపథ్యంలో ఇతను మొత్తంగా రూ.2.5లక్షల వరకు వెనకేసినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 6లో టైటిల్ రేసులో ఉంటాడనుకున్న చలాకీ చంటి చివరకు రూ.2.5లక్షలతో బయటకు రావడంతో ఆయన అభిమానులు కాస్త నిరుత్సాహంగా ఉన్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -