Chalaki Chanti: ఆ పెద్దమనిషి చలాకి చంటిని అలా అవమానించాడా!

Chalaki Chanti: తెలుగు రాష్ట్రాల ప్రజలకు చలాకీ చంటి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షో లో చేసి పాపులర్ అయిన వారిలో చలాకి చంటి ఒకడు. తన ఇమిటేషన్ తో.. కరెక్ట్ టైం లో పంచులు వేయడం చలాకి చంటి లోని ఒక ప్రత్యేకత. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ ద్వారా మంచి పేరు సంపాదించుకొని.. అనంతరం వెండి తెరపై అవకాశాలు పొందాడు.

దాంతో చలాకీ చంటి కమెడియన్ గా ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అంతేకాకుండా కొన్ని ప్రోగ్రామ్స్ కి కూడా చలాకి హోస్ట్ గా వ్యవహరించాడు. ఇలా చంటి తన టాలెంట్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 కి ఎంట్రీ ఇచ్చి.. బుల్లితెర ప్రేక్షకులను మెప్పించబోతున్నాడు. కాగా హౌస్ లోకి వెళ్ళకముందు.. చంటి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు బయటపెట్టాడు.

మల్లెమాల లో తనకు చాలా జరిగాయి అని చెప్పుకొచ్చాడు. కానీ ఏం లేని చోట ఏదో ఒకటి దొరికిందని.. అలాగే సర్దుబాటు చేసుకున్నట్లు వెల్లడించాడు. తాను జబర్దస్త్ నుంచి ఒక సీరియస్ గొడవ కారణంగా బయటికి వచ్చానని తెలిపాడు. ఎందుకంటే తనకి పారితోషికం విషయంలో కోపం వచ్చిందట. రెమ్యూనేషన్ నాకెందుకు తక్కువ ఇస్తున్నారు అని అడిగాడట. మీకు నా గురించి తెలుసు కాబట్టి.. రెమ్యూనేషన్ తక్కువగా ఇస్తున్నారు అని అడిగాడట.

దాంతో ఒక పెద్ద మనిషి ప్రస్తుతం మీ టాలెంట్ కి ఇంతే ఇస్తారు అని చెప్పాడట. అప్పుడు చలాకీ చంటి కి కోపం వచ్చి జబర్దస్త్ నుంచి బయటికి వచ్చినట్లు తెలిపాడు. తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్లు మాట్లాడితే.. మళ్లీ జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇచ్చినట్లు తెలిపాడు. ఇక ఆ పెద్దమనిషి కూడా తనతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపాడు. ప్రస్తుతం బుల్లితెర బిగ్ బాస్ షోలో అడుగుపెట్టిన చలాకి చంటి బుల్లితెర ప్రేక్షకులను ఏవిధంగా మెప్పిస్తాడో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -