Chalaki Chanti: నోరుజారి చంటి బిగ్ బాస్ ఎంట్రీ గురించి అసలు విషయం చెప్పిన యాంకర్?

Chalaki Chanti: బుల్లితెర మీద ప్రసారమైన అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ ఎన్నో ఏళ్లుగా ప్రసారమవుతున్న ఈ రియాలిటీ షో ఇప్పటికే బుల్లితెర మీద 5 సీజన్లను పూర్తి చేసుకుంది. ఇటీవల ఓటిటిలో బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ కూడా పూర్తయింది. అయితే ఈ నాన్ స్టాప్ సీజన్ పూర్తి అయినప్పటి నుండి బిగ్ బాస్ సీజన్ 6 కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. చాలా కాలంగా అదిగో ఇదిగో అంటూ ప్రేక్షకులను ఊరిస్తూ మొత్తానికి ఈ సీజన్ 6 ప్రారంభమయ్యే తేది ఖరారు చేశారు.

ఇటీవల బిగ్ బాస్ సీజన్ 6 ప్రోమో కూడా విడుదల చేశారు. ఈ ప్రోమోలో నాగార్జున బిగ్ బాస్ సీజన్ 6 ఎంటర్‌టైన్‌మెంట్‌కు అడ్డా ఫిక్స్’ అంటూ ప్రమోట్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈ సీజన్ 6 లో పాల్గొనే కంటెస్టెంట్ ల గురించి చర్చ జరుగుతుంది. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ బిగ్ బాస్ సీజన్ 6 లో సామాన్యులకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు స్వయంగా నాగార్జున ప్రకటించాడు.

ఈ సీజన్ సిక్స్ లో సెలబ్రిటీలతో పాటు పాల్గొనే సామాన్యుల గురించి తెలుసుకోవటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. ఎప్పటిలాగే ఈ సీజన్ 6 లో కూడా బుల్లితెర యాంకర్స్ తో పాటు యూట్యూబ్ స్టార్స్ కూడా పార్టిసిపేట్ చేయనున్నారు. అంతే కాకుండా చైల్డ్ ఆర్టిస్టులకు కూడా ఈ సీజన్ లో అవకాశం కల్పించారని సమాచారం. ఇక ఈ బిగ్ బాస్ సీజన్ 6 లో జబర్థస్త్ కమెడియన్స్ కి కూడా అవకాశం కల్పించారని వినికిడి. బిగ్ బాస్ ద్వార కామెడియన్ గా మంచి గుర్తింపు పొందిన చలాకి చంటి ఈ సీజన్ లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చలాకి చంటి ఈ విషయం గురించి మాట్లాడుతూ.. బిగ్ బాస్ షో నిర్వాహకులు తనను సంప్రదించారని, అయితే రెండు విషయాలపై తనకు క్లారిటీ రావాల్సి ఉందని వివరించాడు. అయితే బిగ్ బాస్ యాజమాన్యం వారు వాటికి అంగీకరిస్తే.. హౌస్‌లో వెళ్లే ఛాన్స్ ఉందంటూ చంటి హింట్ ఇచ్చాడు. అయితే చంటిని ఇంటర్వ్యూ చేసిన యాంకర్ మాత్రం నోరు జారీ చంటి చాలా తెలివైన వ్యక్తి అని.. ఇదే తెలివిని బిగ్‌ బాస్ హౌస్‌లో కూడా ఉపయోగించాలని చెప్పుకొచ్చాడు. దీంతో చంటి బిగ్ బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇస్తు్న్నట్లు యాంకర్ నోరు జారి కన్ఫార్మ్ చేశాడు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -