Tollywood: పవన్ కళ్యాణ్, శ్రీదేవి, ఎన్టీఆర్ లు ఆ విషయంలో చాలా అదృష్టవంతులు.. అదేమిటంటే?

Tollywood: సాధారణంగా ఫిలిం ఇండస్ట్రీ అంటే చాలామందికి మోజు ఉంటుంది. ఎలా అంటే సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని.. సినీ ఇండస్ట్రీలో యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవాలని చాలామందికి కోరికలు ఉంటాయి. ఇక ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టి వాళ్లు సెలబ్రేటీ స్థాయిలో ఉన్నప్పటికీ తోటి సెలబ్రేటీలకు ఫిదా అవుతూ ఉంటారు. అంతేకాకుండా తమ పిల్లలకు ఆ తారల పేర్లు పెట్టుకుంటారు. ఇప్పుడు అటువంటి కోవాకే చెందిన సెలబ్రెటీలు.. వాళ్ళు అభిమానించే స్టార్ల గురించి మనం తెలుసుకుందాం.

శ్రీదేవి: ఈ పేరు టాలీవుడ్ ప్రపంచానికి పరిచయం అక్కరలేనిది. వరల్డ్ వైడ్ గా ఎన్నో సినిమాల్లో నటించి దేశమంతా పాపులర్ అయింది. ఇక శ్రీదేవి అందం గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అందంతో ఎంతోమంది అభిమానులను తన సొంతం చేసుకుంది. అటువంటి అందాల భామ మన మధ్య లేకపోయినా కానీ ఆమె పేరు దాదాపు పది తరాలు చెప్పుకుంటారు. ఇటీవల బింబి సారా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన చిన్నారి శ్రీదేవికి.. తమ తల్లిదండ్రులకు శ్రీదేవి పైన ఇష్టంతో ఆ చిన్నారికి ఆ పేరు పెట్టారు.

ఎన్టీఆర్: ఇక తెలుగు ప్రపంచానికి జూనియర్ ఎన్టీఆర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. నటుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక తన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. ఇక సినీనటి రాధిక జూనియర్ ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో తన కొడుకుకి ఎన్టీఆర్ అని పేరు పెట్టిందట. కేవలం ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతోనే నా కొడుకుకి అలా పేరు పెట్టాను అని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

పవన్ కళ్యాణ్: ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇక టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుంది. ఇక పవన్ కి అమ్మాయిల్లో కూడా చాలా ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే ఇటీవల బిగ్ బాస్ ఓటీటీ లో పాల్గొన్న స్రవంతి చొక్కారపు గురించి మనందరికీ తెలిసిందే. తను ఏకంగా పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా పేరును తన కొడుకుకి పెట్టుకుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -