Komati Reddy Venkata Reddy: కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నోటీసులు జారీ చేసిన కాంగ్రెస్.. పది రోజులు డెడ్ లైన్

Komati Reddy Venkata Reddy: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చర్యలకు కాంగ్రెస్ సిద్దమైంది. ఇటీవల లీక్ అయిన ఆడియో కాల్, ఆస్ట్రేలియాలోని వీడియోపై కాంగ్రెస్ సీరియస్ అయింది. రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని ఓ కాంగ్రెస్ నేతతతో మాట్లాడిన ఆడియ టేప్ తో పాటు ఆస్ట్రేలియా పర్యటనలో మునుగోడులో తాను ప్రచారం చేసినా కాంగ్రెస్ గెలవదంటూ వ్యాఖ్యలు చేసిన వీడియోపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆడియో టేపుతో వీడియోను కాంగ్రెస్ అధిష్టానానికి టీ కాంగ్రెస్ నేతలు పంపించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ కూడా ఈ విషయంపై ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై క్రమశిక్షణా చర్య తదుపరి చర్యలు తీసుకకుంది. ఏఐసీసీ సెక్రకటరీ తారీఖ్ అన్వర్ వెంకటరెడ్డిపి షోకాజ్ నోటీస్ పంపారు. పది రోజుల్లో ఆడియో టేప్, వీడియోపై సమాధానం ఇవ్వాలని డెడ్ లైన్ విధించారు. మీ మీద తదుపరి చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ‘మీ తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని కోరిన వాయిస్ రికార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దీనిపై కథనాలు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చాయి. మునుగోడు ఉపఎన్నిక క్రమంలో మీ వైఖరి పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కిందరకే వస్తుంది.. పది రోజుల్లో సమాధానం ఇవ్వండి’ అంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.

ఈ నోటీసులపై వెంకటరెడ్డి ఎలాంటి సమాధానం ఇస్తారనేది ఇఫ్పుడు ఉత్కంఠకరంగా మారింది. వెంకటరెడ్డిపై వేటు వేయాలని, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చాలామంది నేతలు డిమాండ్ చేస్తోన్నారు. ఈ క్రమంలో వెంకటరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. మునుగోడు ఉపఎన్నిక సమయంలో సస్పెన్షన్ వేటు వేస్తే పార్టీకి నష్టం జరిగే అవకాశముందని, అందుకే ఆలస్యం చేస్తుున్నారనే వార్తలు వస్తున్నాయి. మునుగోడు ఉపఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అందుకే ముందుగా నోటీసులు జారీ చేసి 10 రోజుల టైమ్ ఇచ్చారనే వార్తలు వస్తున్నాయి.

వచ్చే 3వ తేదీ మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. ఈ పది రోజుల్లో వెంకటరెడ్డిన వచ్చే సమాధానాన్ని పరిశీలించిన అనంతరం పోలింగ్ ముగిసిన వెంటనే సస్పెండ్ చేసే అవకాశముందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వెంకటరెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. అందుకే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాుడుతున్నారని, రాజగోపాల్ రెడ్డి గెలుస్తారని బహుమాటంగా చెబుతారనే టాక్ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ముునుగోడు ఉపఎన్నిక తర్వాత వెంకటరెడ్డి బీజేపీలో చేరడం ఖాయమని చెబుతున్నారు. పలువురు ఎంపీలు మునుగోడు ఉపఎన్నిల తర్వాత తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారని ఇటీవల బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. అందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

కాగా మునుగోడులో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు అసలు లేవని, తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గెలుస్తారంటూ ఓ కాంగ్రెస నేతతో వెంకటరెడ్డి మాట్లాడిన ఆడియో కాల్ బయటకు లీకైంది. పార్టీలకతీతంగా అందరూ రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని కోరడంపై టీ కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయి. అంతేకాకుండా పలువురు కాంగ్రెస్ నేతలకు వెంకటరెడ్డి కాల్ చేసి రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -