Munugode Bypoll: మునుగోడులో వ్యూహం మార్చిన కాంగ్రెస్.. ఈ సారైనా కలిసొస్తుందా?

Munugode Bypoll: ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలన్నీ మునుగోడు చుట్టుూనే తిరిగుతున్నాయి. పార్టీలన్నీ ఇక్కడ తిష్ట కోసం గెలుపు దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ కాస్త లైట్ తీసుకుంటున్నట్లు కనిపిస్తుండగా.. ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు ఈ ఉపఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే సమయం మిగిలి ఉండటంతో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న తరహాలో మునుగోడలో గెలిస్తే రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పుంజుకోవడంతో పాటు టీఆర్ఎస్ ను దెబ్బకొట్టినట్లు అవుతుందని ప్రతపక్ష పార్టీలు భావిస్తున్నాయి. ఇక టీఆర్ఎస్ కూడా ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ ను దెబ్బకొట్టి టీఆర్ఎస్ దే వచ్చే ఎన్నికల్లో అధికారమని, ప్రజల్లో వ్యతిరేకత లేదనే విషయాన్ని తెలియజేయాలని చూస్తోంది. దీంతో మునుగోడులో ఇప్పటికే కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించిన ఎన్నికలకు సంఖారావం పూరించారు.

కానీ మునుగోడు కాంగ్రెస్ సిట్టింగ్ కావడంతో అన్ని పార్టీల కంటే ఈ ఉపఎన్నిక ఆ పార్టీకి అత్యంత కీలకమైనది. కాంగ్రెస్ నుంచి గెలిచిన రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవిక రాజీనామా చేసి కాషాయ కండువా కప్పుకున్నారు. అందేకే సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడం అనేది కాంగ్రెస్ కు ముఖ్యం. లేకపోతే ఆ పార్టీ మరింత నష్టపోయే అవకాశముంది. ఇఫ్పటికే పార్టీలో అంతర్గత విబేధాలతో కాంగ్రెస్ నామరూపాలులేకుండా పోతోంది. ఇక మునుగోడులో ఓడిపోతే తెలంగాణలో ఆ పార్టీకి మనుగడకే ప్రమాదం పొంచి ఉండే ప్రమాదం లేకపోలేదు. పీసీసీ రేవంత్ రెడ్డికి ఈ ఉపఎన్నిక అగ్నిపరీక్ష అని చెప్పవచ్చు. ఆయన పీసీసీ పదవి చేపట్టాక హుజూరాబాద్ ఉపఎన్నిక జరిగినా అది టీఆర్ఎస్ సిట్టింగ్ కావడంతో రేవంత్ కు పెద్దగా ప్రాబ్లం అనిపించలేదు. కానీ మునుగోడు కాంగ్రెస్ సిట్టింగ్ సీటు కావడంతో రాష్ట్ర కాంగ్రెస్ సారధిగా ఈ సీటును ఆయన గెలిపించాల్సిన పరిస్థితి ఉంది.

ఇప్పటికే రేవంత్ రెడ్డిపై పార్టీలోని సీనియర్లందరూ మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. రేవంత్ కు అసలు సహకరించడం లేదు. మునుగోడులో కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ పై విమర్శల దాడి తీవ్ర స్ధాయికి చేరే అవకాశముంది. ఆయన పీసీసీ పదవికి కూడా ప్రమాదం పొంచి ఉందనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ లోని చాలామంది సీనియర్ నేతలు ఇతర పార్టీల వైపు వెళ్లారు. మునుగోడులో కాంగ్రె్స్ ఓడిపోతే మరికొంతమంది నేతలు పార్టీని వీడే అవకాశముంది. మునుగోడు ఫలితాల తర్వాత పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకుందామని చాలామంది నేతలు వేచి చూస్తున్నారు.

దీంతో మునుగోడులో గెలుపు కోసం కాంగ్రెస్ కొత్త వ్యూహంతో ముందుకెళ్తుంది. దుబ్బాక, హుజూరాబాద్ లాగా కాకుండా సరికొత్త ప్లాన్ తో వెళ్తోంది. దుబ్బాకలో అప్పటివరకు నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేసిన నేతలను కాదని చివరి నిమిషంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డిని పోటీలోకి దింపారు. దీంతో మూడో స్థానానికి కాంగ్రెస్ పరిమితమైంది. కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా దక్కలేదు. ఇక హుజూరాబాద్ లో స్థానికులతో పెద్దగా పరిచయం లేని యువ నేత బల్మూరి వెంకట్ ను బరిలోకి దింపారు. బల్మూరి వెంకట్ కు కేవలం 2 వేల వేట్లు మాత్రమే వచ్చాయి. దీంతో మునుగోడు అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ ఆచితూచి నిర్ణయం తీసుకుంది.

నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా సంబంధమున్న మాజీ ఎమ్మెల్యే పాల్వాయి గోవర్దన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతికే టికెట్ కేటాయించింది. చాలామంది కొత్త పార్టీ పేర్లు తెరపైకి వచ్చాయి. చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవి, కైలాష్ రవి టికెట్ కోసం గట్టిగా పోటీ పడ్డారు. కానీ కొత్త అభ్యర్ధిని పోటీలోకి దింపితే దుబ్బాక, హుజూరాబాద్ లో అయినట్లుగానే చేదు అనుభవం ఎదురవుతుందనే కారణంతో నియోజకవర్గ ప్రజలతో మంచి పరిచయాలు ఉన్న స్రవంతికే టికెట్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నోటిఫికేషన్ రాకుండానే ముందుగా అభ్యర్థిని ప్రకటించింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -