Revanth Reddy: రేవంత్ టార్గెట్ గా సీనియర్లు ఫైర్.. కాంగ్రెస్ లో కలకలం

Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ లో ఎప్పుడూ ఏదోక వివాదం నడుస్తూనే ఉంది. ఏ పార్టీలలో అయినా చాలామంది నేతలు ఉంటారు. ఒకరి అభిప్రాయం ఒకలా ఉంటుంది. దీంతో ఏ పార్టీలో అయినా సరే నేతల మధ్య విబేధాలు ఉంటాయి. ఒక వర్గంపై మరో వర్గం ఆధిప్యతం చూపించాలని చూస్తోంది. దీంతో పార్టీలలో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తూ ఉంటుంది. ఏ పార్టీ తీసుకున్నా సరే ఇవి కామన్. ఒకే పార్టీలోని నేతలు ఒకరిపై ఒకరు బహిరంగంగా దుమ్మెత్తిపోసుకుంటూ ఉంటారు. నేతల మధ్య విబేధాలను అధిష్టానాలు పసిగట్టి సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. నేతల మధ్య రాయాబారం నడుపుతూ ఉంటాయి. నేతల మధ్య గొడవలను పరిష్కరించేందుకు కొన్నిసార్లు ఏకంగా పార్టీల అధినేతలు కూడా రంగంలోకి దిగుతూ ఉంటారు.

టీఆర్ఎస్, వైసీపీ, టీడీపీ.. ఇలా ఏ పార్టీ తీసుకున్నా సరే నేతల మధ్య అంతర్గత విబేధాలు నడుస్తూ ఉంటాయి. కానీ కాంగ్రెస్ లో మాత్రం ఇతర పార్టీల కంటే ఎక్కువగా విబేధాలు ఉంటాయి. పార్టీలోని నేతలే ఒకరిపై ఒకరు మీడియా వేదికగా బహిరంగంగా కొట్లాడుకుంటూ ఉంటారు. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుందని, ఎవరైనా సరే తమ అభిప్రాయాలను చెప్పవచ్చని ఆ పార్టీ నేతలే అంటూ ఉంటారు. ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకోవద్దని, పార్టీలో నేతల మధ్య విబేధాలు ఉంటే అంతర్గత సమావేశాల్లో చర్చించుకోవాలని టీ కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ పలుమార్లు చెప్పారు. బహిరంగంగా విమర్శలు చేసేవారికి చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించారు.

కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరు మాత్రం మార్చుకోవడం లేదు. బహిరంగంగానే మీడియా వేదికగా విమర్శలకు దిగుతున్నారు. జగ్గారెడ్డి, వీహెచ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నేతలు రేవంత్ రెడ్డిపై బహిరంగ విమర్శలకు దిగారు. ఇక ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అద్దంకి దయాకర్ బహిరంగ సభలోనే ఘాటు వ్యాఖ్యలు చేయడం, టీపీసీసీ షోకాజ్ నోటీసులు పంపండి కలకలం రేపింది. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి దయాకర్ క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం సద్దుమణిగింది. అయితే తాజాగా టీ కాంగ్రెస్ లో మరో కల్లోలం రేగింది.

సీనియర్ నేతలైన మర్రి శశిధర్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపై బహిరంగంగా విమర్శలు చేశారు. మీడియా వేదికగా రేవంత్ రెడ్డి, మాణిక్యం ఠాగూర్ లలపై ఆరోపణలు చేశారు. మాణిక్యం ఠాగూర్ కు రేవంత్ ఏజెంట్ గా మారారని, సీనియర్ నేతలను గోడకేసి కొడతా అని రేవంత్ కామెంట్ చేసినా హైకమాండ్ చర్యలు తీసుకోలేదని శశిధర్ రెడ్డి ఆరోపించారు. కోమటిరెడ్డి సోదరుల విషయంలో రేవంత్ తీరు సరిగ్గా లేదని, పార్టీని నడిపిస్తున్న వారే కాంగ్రెస్ లో కల్లోలానికి కారణమని విమర్శించారు. ఇక ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా రేవంత్, మాణిక్యం ఠాగూర్ లో విమర్శలకు దిగారు. ఏఐసీసీ కార్యక్రమాలకు సంబంధించిన తనకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు. అయినా తాను రాజీనామా చేయనని, కాంగ్రెస్ కార్యకర్తగానే కొనసాగుతానని తేల్చి చెప్పారు. ఇలా నేతలు ఒక్కొక్కరుగా బయటకొచ్చి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు చేయడం ఆ పార్టీలో దుమారం రేపుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -