Munugode Bypolls: టీఆర్ఎస్, బీజేపీ కంటే కాంగ్రెస్ ముందు.. మునుగోడులో కాంగ్రెస్ దూకుడు

Munugode Bypolls: మునుగోడు ఉపఎన్నిక ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నవంబర్ లేదా డిసెంబర్ లో ఉపఎన్నిక జరిగే అవకాశముంది. ఇంకా రెండు నెలలు మాత్రమే సమయం ఉండటంతో ఉపఎన్నికలో గెలుపు దిశగా పార్టీలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎవరికి వారు వ్యూహలు రచించుకుంటున్నారు. పార్టీలన్నీ మండలా వారీగా ఇంచార్జ్ లను నియమించి ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ మధ్య రసవత్తర పోరు నడవనుడగా.. షర్మిల పార్టీ కూడా మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేసే అవకాశముంది.

అయితే పార్టీలన్నికంటే మునుగోడులో కాంగ్రెస్ స్పీడ్ గా ఉంది. తాజాగా మునుగోడు ఉపఎన్నిక అభ్యర్ధిని కాంగ్రెస్ అధినాయకత్వం ప్రకటించింది. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతినే ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. దీంతో అన్ని పార్టీల కంటే కాంగ్రెస్ అభ్యర్ధిని ప్రకటించి దూకుడుగా ఉంది. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫిక్స్ అనేది తెలిసిందే. అయితే బీజేపీ ఆ విషయాన్ని అధికారికంగా మాత్రం ఇప్పుడే వెల్లడించడం లేద. ఆయనే మునుగోడు అభ్యర్థి అని బీజేపీ నుంచి ఎలాంటి ధికారిక ప్రకటన చేయలేదు.

ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్ధి ఎవరనేది అర్ధం కావడం లేదు. భారీగా పోటీ ఉండటంతో అభ్యర్ధిని ప్రకటించే అంశంలో కేసీఆర్ జాప్యం చేస్తున్నారు. ముందుగానే అభ్యర్థిని ప్రకటిస్తే మిగతా ఆశావాహులు అసంతృప్తి వ్యక్తం చెందే అవకాశముంది. అందుకే టీఆర్ఎస్ అభ్యర్ధి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. టీఆర్ఎస్ నుంచి ముగ్గురు, నలుగరు నేతలు పడుతున్నారు. అయితే ఇప్పుడే ప్రకటిస్తే టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు వేరే పార్టీకి మద్దతు తెలిపే అవకాశముంది. అందుకే కేసీఆర్ ప్రకటించడానికి వెనకడుగు వేస్తున్నారు.

టీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే టికెట్ కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం సాగుతోంది. కానీ ఆయనకు టికెట్ ఫిక్స్ చేయకపోవడంతో ప్రచారం కూడా చేసుకోలేకపోతున్నారు. తనకు చివరి నిమిషంలో టికెట్ ఇవ్వకపోతే ప్రచారం చేసినా వేస్ట్ అవుతుందని ఆయన భావిస్తున్నారు. అందుకే టికెట్ కేటాయించిన తర్వాత ప్రచారం చేయవచ్చని ఆయన అనుకుంటున్నారు. ఇక కర్రె ప్రభాకర్ పేరు కూడా మునుగోడు అభ్యర్ధి రేసులో వినిపించింది.

అయితే మునుగోడు ఉపఎన్నికలో అందరి కంటే ముందే కాంగ్రెస్ ప్రతి విషయంలోనూ దూకుడుగా ఉంది. అని పార్టీల కంటే ముందుగానే మునుగోడులోని చండూరులో భారీ బహిరంగ సభ నిర్వహించింది. మన కాంగ్రెస్-మన మునుగోడు పేరుతో అందరికంటే ముందే ప్రచారం ముమ్మరం చేసింది. త్వరలో ప్రియాంకగాంధీ కూడా బహిరంగ సభ నిర్వహించే అవకాశముంది. దీంతో అన్ని పార్టీల కంటే మునుగోడులో కాంగ్రస్ ముందుగా ఉండగా.. మిగతా పార్టీలు వెనకనే ఉన్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -