Baby Movie: బేబీ మూవీ అభిమాఅనులకు ఇంతకు మించిన మరో శుభవార్త ఉంటుందా?

Baby Movie: మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాలలో బేబీ సినిమా పేరు మార్మోగిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ తాజాగా పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా విడుదల అవ్వడంతో ప్రేక్షకులు బేబీ సినిమాని పక్కన పెట్టేశారు. దానికి తోడు బ్రో రిలీజ్ వల్ల బేబీ థియేటర్లు ఈ రోజు నుంచి చాలా తగ్గిపోయాయి. స్క్రీన్లు తక్కువగా ఉన్న చోట వీకెండ్ వరకు బ్రోతో రీప్లేస్ చేసేలా నిర్మాతలతో ఒప్పందాలు కుదుర్చుకోవడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా షోలు నడుస్తున్నాయి. అలా అని బేబీ ఫైనల్ రన్ కు వచ్చిందని కాదు.

డిస్ట్రిబ్యూటర్లు ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం బ్రోకు వచ్చిన డివైడ్ టాక్ తిరిగి సాయిరాజేష్ బృందానికే బూస్ట్ అవుతుందని, మళ్ళీ సోమవారం నుంచి పికప్ చూడొచ్చని అంచనా వేస్తున్నారు. ఆగస్ట్ 4 రావాల్సిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వాయిదా పడడంతో అది కలిసొచ్చేలా కనిపిస్తోంది. బేబీ టీమ్ కూడా ఈ అవకాశాన్ని వాడుకునేందుకు రెడీ అవుతోంది. ఎడిటింగ్ లో ఇష్టం లేకపోయినా తొలగించాల్సి వచ్చిన 14 నిమిషాల ఫుటేజిని జోడించబోతున్నట్టు తెలిసింది. ఇందులో ఇప్పటి దాకా ఆడియోలో, థియేటర్లో రిలీజ్ చేయని ఏడో పాట ఉండబోతోంది. ఈ కొత్త వెర్షన్ లో ఏఏ సీన్లు ఉంటాయనేది సస్పెన్స్ గా పెట్టారు.

 

తాజాగా అందిన సమాచారం ప్రకారం చూసుకుంటే విరాజ్ అశ్విన్, నాగబాబు, ఆనంద్ తల్లి పాత్రలకు సంబంధించిన ఫినిషింగ్ సరిగా జరగలేదు కాబట్టి వాటిని జోడించవచ్చని అంటున్నారు. దాంతో పాటు వైష్ణవి చైతన్యకు సంబంధించిన కీలక సన్నివేశాలు కూడా ఉండబోతున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే కనుక నిజమైతే యూత్ మళ్ళీ బేబీని చూడటం ఖాయం. ఇప్పటికే కాలేజీ కుర్రాళ్లు, ప్రేమజంటలు పుణ్యమాని బోలెడు రిపీట్ రన్లు దక్కించుకుంది. రెండో వారం నుంచి ఫ్యామిలీస్ కూడా బాగా వస్తున్నాయి. అలాంటప్పుడు డైరెక్టర్స్ కట్ పేరుతో వదిలే స్పెషల్ ఎడిషన్ కి రెస్పాన్స్ ఖచ్చితంగా బాగుంటుంది. ఓటిటి హక్కులు కొన్నది ఆహానే కాబట్టి మరీ త్వరగా డిజిటల్ రిలీజ్ కాకుండా ప్లాన్ చేసుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -