Cricket: శ్రీలంకతో ఆడే సిరీస్ కు సీనియర్లు దూరం..టీమ్ ఇదే

Cricket: శ్రీలంక జట్టుతో స్వదేశంలో సిరీస్ జరగనుంది. టీ20, వన్డే సిరీస్‌లకు ఇప్పటికే బీసీసీఐ భారత్ జట్టును ఎంపిక చేసింది. జట్టు సభ్యులెవరో బీసీసీఐ ప్రకటించింది. ఈ టీ20 సిరీస్‌లో భాగంగా సీనియర్ ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. టీ20 జట్టుకు హార్ధిక్ పాండ్య కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అయితే వన్డే సిరీస్‌కు మాత్రం రోహిత్ శర్మ సారధ్యం వహించనున్నాడు. ఈసారి బీసీసీఐ ఆచితూచి జట్టు ఎంపిక చేసింది. క్రీడాకారుల ఎంపికలో బీసీసీఐ కీలక మార్పులు చేసినట్లు కనిపిస్తోంది.

 

వన్డే జట్టులో కేఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తప్పించగా హార్ధిక్ పాండ్యాకు ఆ ఛాన్స్ ఇచ్చింది. ఆ తర్వాత వికెట్ కీపర్ అయిన రిషబ్ పంత్‌కు రెండు ఫార్మాట్లలోనూ ఛాన్స్ రాలేదని చెప్పాలి. మరోవైపు టీ20 జట్టులో సూర్యకుమార్ యాదవ్‌ వైస్ కెప్టెన్‌గా బీసీసీఐ ఎంపిక చేసింది.

 

టీ20 సిరీస్ లో అయితే కేఎల్ రాహుల్ కు విశ్రాంతినిచ్చింది. అయితే రాహుల్ వన్డే సిరీస్ లో ఆడనున్నాడు. టీ20 సిరీస్ జరిగే టైంలో రాహుల్ పెళ్లి జరగడం వల్ల అతడ్ని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. శిఖర్ ధావన్‌కు కూడా బీసీసీఐ షాక్ ఇచ్చింది. బీసీసీఐ అతన్ని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

 

ఇకపోతే బుమ్రా పేరును కూడా బీసీసీఐ ప్రస్తావించలేదు. రిషబ్ పంత్‌ ను కూడా బీసీసీఐ పక్కన పెట్టింది. శ్రేయాస్ అయ్యర్ మంచి ఫామ్ లో ఉండటంతో వన్డే జట్టుకు మాత్రమే అతడ్ని ఎంపిక చేసింది. ఆ తర్వాత శుభ్‌మన్, రాహుల్ త్రిపాఠి, పేసర్లు శివమ్ మావి, ముకేశ్ కుమార్ కు టీ20 జట్టులో అవకాశం దక్కింది. ఇకపోతే శ్రీలంక, టీమిండియా జట్ల మధ్య టీ20 మ్యాచ్ లు జనవరి 3, 5, 7వ తేదీల్లో జరగనున్నాయి. అలాగే జనవరి 10, 12, 15వ తేదీల్లో వన్డే మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

Related Articles

ట్రేండింగ్

Mahanadu: ఆ కీలక నేతలు మహానాడుకు ఆ రీజన్ వల్లే మిస్ అయ్యారా?

Mahanadu: మహానాడు కార్యక్రమం ముగిసింది. 2024 ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా బాబు ఈ మ‌హానాడును తీర్చిదిద్దారు. ఎన్టీఆర్ ఫ్రేమ్‌ త‌న ఇమేజ్‌ క‌ల‌గ‌లిపి వ‌చ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాల‌నేది చంద్ర‌బాబు వ్యూహం. అయితే...
- Advertisement -
- Advertisement -