India-Srilanka: భారత్-శ్రీలంక మధ్య వంతెన కడితే రామ సేతుకు నష్టం కలుగుతుందా.. అలా జరగనుందా?

India-Srilanka: శ్రీలంక, భారత్‌ లను కలిపే వంతెన నిర్మాణం కి సంబంధించి చర్చలు మళ్లీ మొదలయ్యాయి. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన భేటీలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ వంతెనను నిర్మించడం నిజంగా సాధ్యమేనా? భారతదేశం, శ్రీలంక మధ్య వంతెన కడితే అది రామ సేతు గా భావించే సున్నపురాయి దిబ్బలపై ప్రభావం చూపుతుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కాగా రెండు రోజుల కిందట శ్రీలంక అధ్యక్షుడు భారత పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా రెండు దేశాలను అనుసంధానించే పలు ప్రాజెక్టులపై రణిల్ విక్రమ సింఘేతో మోదీ చర్చించారు.

 

రెండు దేశాల మధ్య ఫెర్రీ సర్వీసుల పునరుద్ధరణ, విమాన సర్వీసుల విస్తరణ, పైప్ లైన్ పవర్ కనెక్షన్, ఇతర ప్రాజెక్టులపై ఇరు దేశాల నేతలు చర్చించారు. ఈ సందర్బంగా రెండు దేశాల మధ్య వంతెన నిర్మాణం అవకాశాలను పరిశీలిస్తామని మోదీ తెలిపారు. కాగా ఈ వంతెన నిర్మాణానికి సంబంధించి 2015లో చర్చలు ప్రారంభమయ్యాయి. ధనుష్కోడి, తలైమన్నార్ ప్రాంతాలను కలుపుతూ రూ. 35 కోట్లతో వంతెన నిర్మించాలని ఆలోచిస్తున్నట్లు అధికార పార్టీ నేతలు అప్పట్లో తెలిపారు. అలాగే ప్రాజెక్టు నిధుల సేకరణ కోసం కూడా చర్చించారు. అయితే 2015లో శ్రీలంక ప్రధానిగా ఉన్న రణిల్ విక్రమసింఘే భారత్‌లో పర్యటించినప్పుడు నరేంద్ర మోదీ ఇదే అంశంపై చర్చించారు. ఈ ప్రాజెక్టుకు నిధులు అందించేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అప్పట్లో తెలిపారు.

ఆ సమయంలో దక్షిణాసియా ప్రాంతీయ రవాణా కారిడార్‌లను అనుసంధానించేలా ఉండే ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి. అయితే, ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. రణిల్ విక్రమసింఘే అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో ఇరు దేశాల మధ్య వంతెన ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. సముద్రంలో శ్రీలంక, భారతదేశాన్ని కలిపే నిర్మాణాన్ని ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. ఈ సున్నపురాయి వంతెన నిర్మాణం రామేశ్వరం, మన్నార్ ప్రాంతాలను కలుపుతూ దాదాపు 30 కి.మీ. మేర ఉంది. రెండు దేశాల మధ్య బ్రిడ్జి నిర్మించాలనుకుంటే అది ఈ నిర్మాణంపైనే ఉంటుందా, లేక మరో చోటనా అనేది ఇంకా తేలలేదు. భౌగోళికంగా భారత్, శ్రీలంక మధ్య వంతెన నిర్మించడం సాధ్యమేనని ప్రొఫెసర్ ఎస్ఏ నోర్బర్ట్ బీబీసీతో చెప్పారు. ఎస్ఏ నోర్బర్ట్ కొలంబో యూనివర్శిటీలోని జియాలజీ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు.

 

భారత్-శ్రీలంక మధ్య సముద్ర ప్రాంతంలో లోతు తక్కువగా ఉందని, అందుకే వంతెనను సులభంగా నిర్మించవచ్చని ఆయన అన్నారు..సేతు సముద్రం ప్రాజెక్ట్ ఆచరణ సాధ్యం కానప్పటికీ శ్రీలంక, భారత్‌ మధ్య ఈ వంతెన నిర్మాణం సాధ్యమేనన్నారు. ఈ వంతెనను నిర్మించడం పెద్ద విషయమేం కాదు. కాంక్రీట్ స్తంభాలను ఏర్పాటు చేయవచ్చు. లోతులేని ప్రాంతాలలో వంతెనలను నిర్మించవచ్చు. వీటికి ఎలాంటి సమస్యా లేదు. వంతెన కోసం ఇది ఒక అనువైన ప్రాంతం అని నోర్బర్ట్ తెలిపారు.
ఒక వంతెనను నిర్మించినప్పుడు, ట్రాఫిక్‌ సహా ప్రతిదీ నిర్మించేవారి నియంత్రణలోకి వస్తుంది. చైనాతో పాటు అనేక దేశాలు సముద్రంపై వంతెనలు కట్టాయి. కాబట్టి ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో భారత్-శ్రీలంక మధ్య వంతెన నిర్మాణం సాధ్యమే అని ఆయన అభిప్రాయపడ్డారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -