Cricketer: బాలీవుడ్ హీరోయిన్‌తో డేటింగ్ నిజమేనని ప్రకటించిన శుభ్‌మన్‌గిల్

Cricketer: న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో ఆడుతున్న టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ తన ఆటతో కాకుండా వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. గతంలో టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో శుభ్‌మన్ ప్రేమాయణం నడుపుతున్నాడని వార్తలు వచ్చాయి. ఇవి నిజమో కాదో తెలియకముందే వాళ్లిద్దరి మధ్య బ్రేకప్ జరిగిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్‌తో పీకల్లోతు ప్రేమలో గిల్ ఉన్నాడని ప్రచారం జరుగుతోంది.

 

ఇటీవల సారా అలీఖాన్‌తో కలిసి శుభ్‌మన్‌ గిల్ డిన్నర్‌కు వెళ్లాడు. ఈ డిన్నర్‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో సారా అలీఖాన్‌తో శుభ్‌మన్ ప్రేమాయణం నిజమేనని అభిమానులు విశ్వసిస్తున్నారు. త్వరలోనే శుభమన్ గిల్, సారా అలీఖాన్ పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సారాతో రిలేషన్‌షిప్ గురించి గిల్ క్లారిటీ ఇచ్చాడు.

 

ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో్ సారా అలీఖాన్‌తో డేటింగ్ అంశంపై ప్రశ్నించగా శుభమన్ గిల్ స్పందించాడు. అయితే అతడు సారా గురించి తాను మొత్తం చెప్పేశానని.. తాను డేటింగ్‌లో ఉండొచ్చు. ఉండకపోవచ్చు అంటూ బదులిచ్చాడు. అలాగే బాలీవుడ్‌లో అత్యంత ఫిట్‌గా ఉండే నటి ఎవరని అడగ్గా.. సారా అంటూ గిల్ సమాధానం చెప్పాడు. దీంతో డేటింగ్ నిజమేనని గిల్ పరోక్షంగా అంగీకరించాడు.

 

తుది జట్టులో గిల్ ఉంటాడా?

అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటి వరకు 12 వన్డేలు ఆడిన శుభ్‌మన్‌ గిల్‌.. 579 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ ఉంది. 11 టెస్టులు ఆడి 579 పరుగులు చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో ఓపెనర్లు విఫలమైన నేపథ్యంలో శుభ్‌మన్‌ను రెగ్యులర్ ఓపెనర్‌గా జట్టులో కొనసాగించాలనే డిమాండ్ వినిపిస్తోంది. మరి కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఏం చేస్తాడో వేచి చూడాలి. ప్రస్తుతానికైతే ఇషాన్ కిషన్‌తో శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Volunteers on YSRCP Manifesto: గ్రామ వాలంటీర్ల మైండ్ బ్లాంక్ చేసిన మేనిఫెస్టో.. నిన్ను నమ్మం జగన్ అంటూ?

Volunteers on YSRCP Manifesto: వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టోని చూసి సాధారణ ప్రజలే కాదు ఆయన కోసమే పని చేసిన గ్రామ వాలంటీర్లు కూడా జగన్ అన్యాయం చేశాడని గగ్గోలు పెడుతున్నారు సదరు గ్రామ వాలంటీర్లు. గత...
- Advertisement -
- Advertisement -