న్యూడ్ కాల్స్ తో కవ్విస్తారు.. బుట్టలో పడితే పరువు బజారున పడినట్లే

Crime News: సైబర్ నేరాలు కొత్త పుంతలు తోక్కుతున్నాయి. ఒకప్పుడు నేరాలు అంటే ఇంట్లోకి వచ్చి దొంచాటుగా దోచుకోవడం, ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు బద్దలుకొట్టి డబ్బులు దోచుకునేవారు. కానీ ప్రస్తుత టెక్నాలజీ యుగంలో సులువుగా, చాలా ఈజీగా, స్మార్ట్ గా డబ్బులు దోచేస్తున్నాయి. ఎదుటివారిని మోసం చేయడానికి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేకుండా పోతోంది. టెక్నాలజీ కాలంలో సైబర్ నేరాలు ఎక్కువైపోయాయి. సైబర్ నేరగాళ్లు కొత్త ఆలోచనలతో తెలివిగా మోసం చేస్తున్నారు. తమ స్మార్ట్ నెస్ తో సులువుగా డబ్బులు కాజేస్తున్నాయి.

ఇక అమ్మాయిలను వలగా వేసి డబ్బులు కాజేస్తున్న సైబర్ నేరాలు ఇటీవల కాలంలో ఎక్కువగా నమోదవుతున్నాయి. అమ్మాయిలు కాల్స్ చేసి కవ్విస్తూ నగ్న వీడియోలు పంపుతూ చివరికి డబ్బులు గుంజుతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే వీడియోలు బయట పెడుతామంటూ బ్లాక్ మెయిలింగ్ గు దిగుతున్నారు. ర్యాండమ్ గా కాల్స్ చేస్తారు. ఫోన్ లిప్ట్ చేస్తే అమ్మాయిలు తమ మాటలతో ఎదుటి వ్యక్తిని మాటల్లోకి దింపుతారు. వారి వలలో పడితే ఇక అంతే సంగతులు. నగ్న వీడియోలు పంపుతారు. వాటికి మీరు టెంప్ట్ అయి వారితో కాల్స్ మాట్లాడితే వాటిని రికార్డు చేస్తారు. ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చేస్తారు. ఇవ్వకపోతే మీ కాల్ రికార్డులు బంధువులకకు పంపుతామంటూ బ్లాక్ మెయిలింగ్ కు దిగుతారు.

సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఇాలంటి ఉచ్చులో పడి చాలామంది బయటకు చెప్పుకోలేక బాధపడుతున్నారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలోని ఓ వ్యక్తికి అనుకోకుండా కాల్ వచ్చింది. అమ్మాయి కదా అని కాల్ మాట్లాడాడు. తర్వాత నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడుకున్నారు. తర్వాత అమ్మాయి బ్లాక్ మెయిలింగ్ కు దిగింది. ఇక నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డికి చెందిన ఓ వ్యక్తి, కామారెడ్డి పట్టణంలోని ఓ పొలిటికల్లీడర్ ఇలా న్యూడ్ కాల్స్ బాధితులుగా మారారు. పోలీసులు ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తన్నా.. మగాళ్ల వీకె నెస్ ను అమ్మాయిలు వాడుకుుని చివరకు బ్లాక్ మెయిలింగ్ కు దిగుతున్నారు. చివరికి చేసేదేమీ లేక పరువు పోతుందనే కారణంతో డబ్బులు కడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan , YS Sharmila: పసుపు రంగును జగన్ సహించలేకపోతున్నారా.. నీచమైన కామెంట్ల వెనుక కారణాలివేనా?

CM Jagan , YS Sharmila: వైయస్ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి అంటే ఆయన మాట తీరు ఆయన వ్యవహార శైలి ఎలా...
- Advertisement -
- Advertisement -